వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగురాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఏపీలో వెలుగులోకి.. తెలంగాణలో కూడా..

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. దాంతో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా వస్తున్నాయి. దీని తీవ్రత ఎక్కువగా ఉండటం.. క్యూర్ కావడం తక్కువగా ఉంటోంది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏపీలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిసారిగా ఈ బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది.

Recommended Video

Black Fungus Alert: ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం Dr. Sampurna Ghosh | PART 3 | Oneindia Telugu

నిడదవోలులో కోలపల్లి అంజిబాబు అనే వ్యక్లికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. 15 రోజుల క్రితమే అంజిబాబు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికే ఆయన కన్ను వాచిపోయింది. గతవారం రోజులుగా కన్ను వాపు పెరుగుతూ వస్తోంది. దీంతో రాజమండ్రి, వైజాగ్ వైద్యులను ఆయన కుటుంబీకులు సంప్రదించారు. బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు వీటిని ధృవీకరించారు. కన్ను, ముక్కు, మెదడుకు ఈ బ్లాక్ ఫంగస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. బ్లాక్ ఫంగస్ లక్షణాల కారణంగా కన్నును వెంటనే తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అంజిబాబు కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

first black fungus case in ap and ts also

ఇటు తెలంగాణలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బయటపడింది. చందుర్తి మండలం మల్యాలకు చెందిన టీచర్ అల్లం లింగయ్య ఇటీవల కరోనా వచ్చింది. 20 రోజుల క్రితం కరోనా రాగా.. 10 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఇంటి వద్ద ఉంటుండగా.. మొహం, మెడ ఉబ్బింది. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ కరీంనగర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు దానిని బ్లాక్ ఫంగస్‌గా గుర్తించి.. హైదరాబాద్ తరలించారు.

English summary
first black fungus case in andhra pradesh and telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X