వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: జయ పరిస్థితి చాలా విషమంగా ఉంది: మొదటి సారి అపోలో

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థతి చాల విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి 74 రోజుల తరువాత స్వయంగా మొదటి సారి అంగీకరించింది. అయినా మా ప్రయత్నాలు మేం చేస్తున్నామని అపోలో ఆసుపత్రి వైద్యులు అంటున్నారు. సోమవారం మద్యాహ్నం 12.45 గంటల సమయంలో అపోలో ఆసుపత్రి వైద్యులు జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

 First time Apollo is using a word very critical

అందులో జయలలిత ఆరోగ్యం చాల విషమంగా ఉందని స్వయంగా అపోలో ఆసుపత్రి వైద్యులు దృవీకరించారు. జయలలిత గుండెపోటుతో సహ అనేక సమస్యలతో బాధపడుతున్నారని, అయినా ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామని అపోలో ఆసుపత్రి సీనియర్ డాక్టర్ డాక్టర్ సుబ్బయ్య విశ్వనాథన్ సోమవారం మద్యాహ్నం ఓ ప్రకనట విడుదల చేశారు.

అపోలో ఆసుపత్రి నుంచి ప్రకటన విడుదల అయిన తరువాత చెన్నైతో పాటు తమిళనాడులో పరిస్థితి అదుపుతప్పింది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాలో అంటూ అమ్మ అభిమానులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

 First time Apollo is using a word very critical

అయితే అన్నాడీఎంకే నాయకులు మాత్రం ఈ విషయంలో మోనంగా ఉండిపోవడంతో పలుఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత కాలం అంతా ఓకే అంటూ చెబుతూ వచ్చిన అపోలో ఆసుపత్రి వర్గాలు మొదటి సారి అమ్మ పరిస్థతి చాల విషమంగా ఉందని చెప్పడంతో అందరూ హడలిపోతున్నారు.

English summary
Tamil Nadi CM Jayalalithaa continues to be very critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X