మహిళా విద్యార్థి నేత అనుమానాస్పద మృతి
అలీగఢ్: అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆస్మా జావేద్ అనే మహిళ అనుమానాస్పద పరిస్థితిలో మరణించింది. నాలుగేళ్ల క్రితం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఆమె పోటీకి దిగింది. విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలి మహిళ కావడంతో ఆమె పేరు మీడియాలో మారుమ్రోగిపోయింది.
అలీగఢ్‌లో అస్మాజావెద్ (28) అపార్ట్‌మెంట్‌లో మృతి చెంది ఉన్నట్టు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై ఆస్మా సోదరున్ని అడుగగా కొన్ని రోజుల నుంచి ఆస్మా జావెద్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉన్నట్టు తెలిపారు.
నాలుగు రోజుల క్రితం అస్మా మృతి చెంది ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అస్మా గతలంలో 2011 లో జరిగిన విద్యార్థి సంఘ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు.

అపార్ట్ మెంట్ లో అస్మా ఒంటరిగానే నివాసం ఉంటుందని, ఆమె భర్త ప్రస్తుతం దక్షిణాప్రికాలో ఉన్నారని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థి సంఘ ఎన్నికల్లో నిలబడిందని కొందరు ప్రత్యర్థులు కుట్ర పన్ని తమ కూతురుని హత్య చేశారని మృతురాలు బంధువులు ఆరోపిస్తున్నారు.
మే 9వ తేదీ నుంచి తాను ఆమెతో మాట్లాడలేదని, ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు చెప్పారని, తమ అంకుల్ సమీపంలోనే ఉంటారని, తాను పోలీసులను వెంట తీసుకుని వెళ్లి ఫ్లాట్ తలుపులు తీసినట్లు అస్మా సోదరుడు సల్మాన్ జావేద్ చెప్పారు.
ఆస్మాకు చెందిన కొంత నగదు, టాబ్లెట్ కనిపించకుండా పోయాయి. ఆస్మా మహిళా హక్కుల గురించి మాట్లాడుతూ ఉండేది.












Click it and Unblock the Notifications