family: ఒకే ఫ్యామిలీలో ఐదు మంది సజీవదహనం, రాత్రి భోజనం తరువాత ఏం జరిగింది ?
రాత్రి భోజనం చేసి నిద్రపోయిన కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి పైలోకాలకు వెళ్లిపోయారు. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.
లక్నో/కాన్ఫూర్: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పేదవాడు అయినా అతని భార్యకు, పిల్లలకు ఏ లోటురాకుండా చూసుకున్నాడు. అయితే దేవుడు ఆ కుటుంబం మీద కరుణ చూపించలేదు. రాత్రి భోజనం చేసి నిద్రపోయిన కుటుంబ సభ్యులు అందరూ ఒకేసారి పైలోకాలకు వెళ్లిపోయారు. ఒకేసారి ఫ్యామిలీ మొత్తం చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.

సంతోషంగా కాపురం చేశారు
ఉత్తరప్రదేశ్ లోని కాన్ఫూర్ సమీపంలోని హరామౌ ప్రాంతంలో సతీష్ (29) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కాజల్ (26) అనే యువతిని వివాహం చేసుకోవాలని సతీస్ కు అతని కుటుంబ సభ్యులు సూచించారు. కూలి పనులు చేస్తున్న సతీష్ కుటుంబ సభ్యులు చూపించిన కాజల్ ను వివాహం చేసుకున్నాడు. కాజల్, సతీష్ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

కుమారులు, కుమార్తె
కాజల్, సతీష్ దంపతులకు సన్నీ (7), సందీప్ (4) అనే ఇద్దరు కుమారులు, గుడియా (2) అనే కుమార్తె ఉన్నారు. పేదవాడు అయినా సతీష్ అతని భార్య కాజల్ కు, ముగ్గురు పిల్లలకు ఏ లోటురాకుండా చూసుకున్నాడు. నెలకు ఒక రోజు భార్య కాజల్ తో పాటు అతని ముగ్గురు పిల్లలను బంధువుల ఇంటికి, తరువాత సినిమాకు పిలుచుకుని వెళ్లి వారు ఆనందంగా ఉండాలే చూసుకుంటున్నాడు.

ఇంట్లో మంటలు
సతీష్ అతని భార్య, పిల్లలతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నాడు. శనివారం రాత్రి సతీష్ ఇంటికి వెళ్లాడు. తరువాత భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి సతీష్ తో భోజనం చేశాడు. భోజనం చేసిన తరువాత కాజల్, సతీష్ దంపతులు నిద్రపోయారు. ఆదివారం వేకువ జామున సతీష్ తోపాటు అతని కుటుంబ సభ్యులు గాఢనిద్రలో ఉన్న సమయంలో వారి నివాసం ఉంటున్న ఇంటిలో మంటలు వ్యాపించాయి.

సజీవదహనం
అయితే సతీస్, కాజల్ దంపతులు పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. పిల్లలను బయటకు ఎత్తుకుని రావాలని ప్రయత్నాలు చేసిన సతీష్ తో పాటు అతని భార్య కాజల్, వారి ముగ్గురు పిల్లలు అదే ఇంటిలో సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే ఐదు మంది సజీవదహనం అయ్యారు.

సీఎం ఏం చెప్పారంటే ?
ఒకే ఫ్యామిలీలో ఐదు మంది చనిపోవడంతో తాను చాలా చలించిపోయానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంలో సతీష్, దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులను రక్షించడానికి ప్రయత్నించి గాయాలైన వారికి ప్రభుత్వం చికిత్స అందిస్తుందని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన సతీష్ ఇంటిలో మంటలు వ్యాపించాయని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications