శ్రీనగర్ సరిహద్దు: ఐదు మంది ఉగ్రవాదులు అంతం
శ్రీనగర్: భారత్ లోకి అక్రమంగా చోరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడంతో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు. వారు జరిపిన కాల్పులలో భారత్ జవాను మరణించాడు.
శ్రీనగర్ లోని బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద శుక్రవారం రాత్రి భారత్ సైన్యం గస్తి తిరుగుతున్నది. ఆ సందర్బంలో అత్యాధునిక ఆయుధాలు చేత పెట్టుకున్న ఉగ్రవాదులు సరిహద్దు రేఖ దాటి భారత్ లోకి చోరబడటానికి ప్రయత్నించారు.

విషయం పసిగట్టిన భారత సైన్యం కాల్పులు జరిపింది. ఉగ్రవాదులు ఎదురు కాల్పులకు పాల్పడటంతో ఆ ప్రాంతంతో తుపాకుల తూటాల మోతతో దద్దరిల్లింది. చాల సేసు అక్కడ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.
భారత్ జవాను మరణించాడని అర్మీ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి భారత్ లోకి చొరబడటానికి చాల మంది ఉగ్రవాదులు ప్రయత్నించారని, ఐదు మంది మరణించగా చాల మంది కాలికి బుద్ది చెప్పి అక్కడి నుండి పరారైనారని అర్మీ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications