లాలూ దాణా కుంభకోణం మూడో కేసులో నేడే తీర్పు
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు సంబంధించిన మూడో దాణా కుంభకోణం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇప్పటికే లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న
రాంచీ: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్‌కు సంబంధించిన మూడో దాణా కుంభకోణం కేసులో బుధవారం తీర్పు వెలువడనుంది. ఈ కేసులో ఇప్పటికే లాలూ, జగన్నాథ మిశ్రా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి రాంచీలోని ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్ఎస్.ప్రసాద్ బుధవారం తీర్పునివ్వనున్నారు. ఇప్పటికే లాలూ రెండో దాణా కుంభకోణం కేసులో మూడేన్నరేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బిర్సా ముండా కేంద్ర కారాగారంలో ఉన్నారు.

మూడో దాణా కుంభకోణం కేసులో ఛాయ్బసా ఖజానా నుంచి రూ.36కోట్లు అక్రమంగా పొందినట్లు లాలూ, మిశ్రాపై కేసు ఉంది. దీనికి సంబంధించిన తీర్పునే బుధవారం వెలువరించనున్నారు.
లాలూపై మొత్తం ఐదు దాణా కుంభకోణం కేసులు ఉన్నాయి. 2013లో మొదటి దాణా కుంభకోణం కేసులో లాలూ అయిదేళ్ల జైలు శిక్ష పడింది. మరో కేసులో ఈనెల 6న లాలూకి మూడున్నరేళ్ల జైలు శిక్షను విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
ఇంకా ఆయనపై దమ్కా ఖజానా నుంచి రూ.3.97కోట్లు, దొరాండా ఖజానా ద్వారా రూ.184కోట్లు అక్రమంగా పొందినట్లు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించిన తీర్పులు త్వరలోనే వెలువడే అవకాశాలున్నాయి.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications