వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:యూనిటెక్ కు సుప్రీంకోర్టు భారీ జరిమానా, నిర్లక్ష్యానికి మూల్యం!

రియాల్టీ కంపెనీ యూనిటెక్ కు సుప్రీం కోర్టు భారీ జరిమానాను విధించింది. వినియోగదారులకు సకాలంలో ఫ్లాట్స్ ను కేటాయించకపోవడంతో సుప్రీం కోర్టు సోమవారం నాడు ఈ తీర్పును వెలువరించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రియాల్టీ దిగ్గజం యూనిటెక్ కంపెనీపై మరోసారి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వినియోగదారులకు కేటాయించాల్సిన ప్లాట్స్ విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోన్న ఢిలీ ఆధారిత యూనిటెక్ కంపెనీకి సుప్రీం కోర్టు భారీ జరిమానాను విధించింది.

యూనిటెక్ ప్రకటించినట్టుగా ఆరు మాసాల్లో ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించింది. 2010 జనవరి 1వ, తేది నుండి 39 మంది ప్లాట్ కొనుగోలు దారులకు ఏడాదికి 14 శాతం వడ్డీ చెల్లించాలని సోమవారం నాడు ఆదేశించింది.

For project delay, Supreme Court slaps builder Unitech with huge fine

ప్లాట్ కొనుగోలు కోసం 39 మంది కొనుగోలు దారులు చెల్లించిన రూ.16.55 కోట్లపై వడ్డీ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఈ మొత్తంలో 90 శాతం నగదును ఎనిమిది వారాల్లోపుగా చెల్లించాలని యూనిటెక్ ఇన్ ఫ్రా ప్రాజెక్టు యాజమాన్యాన్ని ఆదేశించింది సుప్రీం కోర్టు.

జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎఎంఖాన్ మిల్కర్, జస్టిస్ మోహన్ ఎం. శంతన్ గౌడర్ ఆధ్వర్యంలో సుప్రీం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.ఈ సందర్భంగా ప్రజల స్వంత ఇంటి కలలతో ఆడుకోవద్దని కోర్టు హితవు పలికింది.

English summary
In a big jolt to wealthy builders who leave consumers at their mercy, the Supreme Court today directed Delhi-based Unitech to pay a fine equivalent to a whopping 14 per cent a year of the principal deposited by 39 buyers, retroactive from 2010, in addition to returning the principal amount.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X