Nagaland Elections 2023: నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన మహిళ..
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళ.
నాగాలాండ్ రాష్ట్ర హోదా పొందిన 60 ఏళ్ల తర్వాత ఈరోజు తొలిసారిగా మహిళా ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజెపి మిత్రపక్షం ఎన్‌డిపిపికి చెందిన హెకానీ జఖాలు దిమాపూర్-3 స్థానం నుంచి గెలుపొందారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళల్లో 48 ఏళ్ల న్యాయవాది-కార్యకర్త జఖాలు లోక్ జనశక్తి పార్టీకి చెందిన అజెటో జిమోమిని ఓడించారు.పశ్చిమ అంగామి స్థానంలో ఎన్‌డిపిపికి చెందిన మరో మహిళా అభ్యర్థి సల్హౌటుయోనువో క్రూసే ముందంజలో ఉన్నారు.
నాగాలాండ్‌లో అధికార ఎన్‌డిపిపి-బిజెపి కూటమి మూడు స్థానాల్లో విజయం సాధించి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికారాన్ని నిలబెట్టుకోనుంది. ఎన్‌డిపిపి-బిజెపి కూటమి 2018లో ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకోగా, ఎన్‌పీఎఫ్ 26 సీట్లు గెలుచుకుంది.త్రిపురలో పార్టీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, నాగాలాండ్‌లో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బిజెపి సిద్ధమవుతోంది.

ఈశాన్య ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతి, అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తుందని ఆ పార్టీ నేతలు చెప్పారు. హైవేలు నిర్మించడం లేదా తాగునీరు, ఉచితంగా కనీస సౌకర్యాలు కల్పించడం వంటివి చేసిందని వివరించారు.ఈ ప్రాంత అభవృద్ధికి కృషి చేసిన బిజెపికో పట్టం కట్టారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.












Click it and Unblock the Notifications