ఆసుపత్రిలో మాజీ సీఎం, ఒక్కసారిగా ఏం జరిగింది, ఆంధ్రా బార్డర్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తే !
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకు ఒక బాంబు పేల్చుతున్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, జేడీఎస్ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్దంగా ఉన్నారని పదేపదే చెబుతున్నారు.
ఇప్పటికే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండిపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీ నాయకత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇదే సమయంలో మాజీ సీఎం, జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తల్లో ఉత్సహాం నింపడానికి, జేడీఎస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ. కుమారస్వామి తీవ్ర జ్వరంతో బాధపడుతూ బుధవారం బెంగళూరు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కుమారస్వామికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే జేడీఎస్ పార్టీ కార్యాలయంలో వరుస సమావేశాలు నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బుధవారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలారు జిల్లాలోని శ్రీనివాసపురలోని రైతుల భూములను సందర్శించాల్సి ఉంది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కోలార్‌లో పర్యటించి రైతులతో మాట్లాడటానికి సిద్దం అయ్యారు. అయితే అకస్మాత్తుగా మాజీ సీఎం కుమారస్వామి ఆరోగ్యంలో మార్పు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరడంతో ఆయన కోలార్ పర్యటన రద్దు అయ్యింది.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొంటున్నప్పుడు అలసట, జ్వరం కారణంగా బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఎన్నికల ఫలితాల అనంతరం మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి విశ్రాంతి కోసం కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు.












Click it and Unblock the Notifications