సొంత పార్టీ నాయకుల మీద ఉమాభారతి సెటైర్లు, మోదీ, అమిత్ షా, నడ్డాలకు షాక్ !
భోపాల్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమాభారతిని సొంత పార్టీ పట్టించుకోలేదని మరోసారి స్పష్టంగా వెలుగు చూసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఆదివారం జానాశీర్వాద యాత్రను ప్రారంభించారు. ఈసారి కూడా ఈ కార్యక్రమంలో మాజీ సీఎం ఉమాభారతి కనిపించలేదు.
దీనిపై ఉమాభారతి స్పందిస్తూ నేను అక్కడ ఉంటే ప్రజల దృష్టి మొత్తం నాపై పడుతుందని బీజేపీ నేతలు భయపడి ఉండొచ్చు అని వ్యంగంగా అన్నారు. 2020లో జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ నాయకులు సహాయం చేస్తే 2003లో నేను కూడా ఆయనకు భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహాయం చేశాను అని మాజీ సీఎం ఉమాభారతి అన్నారు. సింధియా నాకు మేనల్లుడు లాంటి వాడు అన్నిఆమె అన్నారు.

యాత్ర సమయంలో నన్నుఆహ్వానించడానికి తనకు అర్హత ఉందని, అయినా నన్ను పిలవలేదని, కానీ నేను ఇంకా బీజేపీలోనే ఉన్నానని, నా పార్టీకి నేను ప్రచారం చేస్తాను అని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం ఓట్లు అడుగుతాను అని ఉమాభారతి అన్నారు. బీజేపీ తనను తప్పించడం పై తాను ఇంకా ఎక్కువగా వ్యాఖ్యానించలేనని ఉమాభారతి అన్నారు. కానీ మధ్యప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షుణ్ణం పరిశీలిస్తున్నారు.

బీజేపీని వెలుగులోకి తెచ్చిన రామమందిర ఉద్యమంలో ఉమాభారతి కీలక నేతల్లో ఒకరు అని ప్రత్యేకంగా చెప్పవనసరం లేదు. భోపాల్‌లోనే ఉన్న కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ బీజేపీ తమ నేతలను అవమానిస్తోందని, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను ఆ పార్టీ పక్కన పెట్టిందని, మన సంస్కృతిలో పెద్దలను గౌరవించని ఎవరినైనా సరే ఆ దేవుడు కూడా క్షమించడని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.

2003లో ఉమాభారతి మధ్యప్రదేశ్‌లో దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనకు చెక్ పెట్టారు. కానీ 2005లో క్రమశిక్షణా రాహిత్యంతో ఉమాభారతి పార్టీ నుంచి బహిష్కరణకు గురైనారు. 2011లో తిరిగి ఉమాభారతిని బీజేపీలోకి మళ్లీ తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా ఉమాభారతి పోరాటాన్ని కొనసాగించారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి నాయకత్వం వహిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం విడుదల చేసే మద్యం పాలసీకి తగిన సవరణలు, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఉమాభారతి డిమాండ్ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని మద్యం దుకాణాలను గోశాలలుగా మార్చాలని బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఉమాభారతి డిమాండ్ చేశారు. మహిళలపై నేరాలు పెరగడానికి మద్యపానమే కారణం. ప్రభుత్వ మద్యం పాలసీలో మార్పులు తీసుకురావాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను గోశాలలుగా మార్చేందుకు చొరవ చూపాలని సొంత బీజేపీ మీద ఉమాభారతి మండిపడుతున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications