Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోదీ ఆఫర్‌కు నో..?: సొంత కుంపటి: అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటన

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. ఇక సొంత కుంపటి పెట్టుకునే దిశగా అడుగులు వేస్తోన్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన సొంతంగా పార్టీని నెలకొల్పడానికి సమాయాత్తమౌతోన్నారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లో విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన షెడ్యూల్‌ను త్వరలోనే ఖరారు చేస్తారని సమాచారం. అసెంబ్లీకి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆజాద్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా నుంచి..

రాజీనామా నుంచి..

ఆజాద్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. వెళ్తూ, వెళ్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలను సంధించారు.

చిన్నపిల్లాడి మనస్తత్వం..

చిన్నపిల్లాడి మనస్తత్వం..


సోనియా గాంధీకి పంపించిన అయిదు పేజీల లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లాడి మనస్తత్వంగా అభివర్ణించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా అపాయింట్ అయిన తరువాత సలహాదారుల వ్యవస్థ మొత్తం ధ్వంసమైందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను చింపేయడంతోనే రాహుల్ గాంధీకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏ పాటిదో అర్థమైందని అన్నారు.

రాహుల్ సెక్యూరిటీ గార్డుల చేతుల్లో..

రాహుల్ సెక్యూరిటీ గార్డుల చేతుల్లో..

పార్టీకి ఇప్పుడు కావాల్సింది భారత్ జోడో యాత్ర కాదని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ జోడో అత్యవసరం అని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీలో కీలక నిర్ణయాలన్నింటినీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకుంటోన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న రాహుల్ గాంధీ చేతిలో కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు కొనసాగడం సహేతుకం కాదని అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు.

సొంత పార్టీ..

సొంత పార్టీ..

ఇప్పుడాయన జమ్మూ కాశ్మీర్‌లో సొంతంగా రాజకీయ పార్టీని నెలకొల్పే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. రాజీనామా తరువాత ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌గా వెళ్తారనే ప్రచారం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఆజాద్‌తో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనను గవర్నర్‌గా అపాయింట్ చేయొచ్చనే ఊహగానాలు మొదట్లో చెలరేగాయి. దానిపై ఆజాద్ పెద్దగా ఆసక్తిగా లేరని, జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

4 నుంచి మెగా ర్యాలీ..

4 నుంచి మెగా ర్యాలీ..


ఇందులో భాగంగా ఆజాద్.. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి జమ్మూ కాశ్మీర్‌లో విస్తృతంగా పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని 20 జిల్లాల్లోనూ పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోన్నారు. తొలి దశలో తన సొంత జిల్లా చినార్ వ్యాలీతో పాటు దోడా, కిష్తవార్, రాంబన్‌లల్లో బహిరంగ సభలను నిర్వహిస్తారని తెలుస్తోంది. మలిదశలో అనంత్‌నాగ్, శ్రీనగర్‌లల్లో పర్యటిస్తారని చెబుతున్నారు.

Recommended Video

    Ghulam Nabi Azad ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ని హర్ట్ చేసిండు *Politics | Telugu OneIndia
    90 నియోజకవర్గాల్లో..

    90 నియోజకవర్గాల్లో..

    అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం 90 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపేలా ఇయన ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారని స్థానిక మీడియా వెల్లడించింది. కనీసం 60 సీట్లల్లో విజయఢంకా మోగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారని, దీనికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుంటోన్నారని స్పష్టం చేసింది. ఆజాద్‌ వర్గానికి చెందిన నాయకులుగా ముద్రపడిన 60 మంది ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆయన పెట్టబోయే పార్టీలో చేరడానికి సిద్ధం అయ్యారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+