మాజీ డీసీఎం బంధువు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ?, వెంటాడి వెంటాడి లేపేశారు, ఎలక్షన్స్ కు ముందే!
లోక్ సభ ఎన్నికల సమయంలో పాతకక్షలు భగ్గుమన్నాయి మాజీ డీసీఎం, సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని పక్కాప్లాన్ తో అతి దారుణంగా హత్య చేశారు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అథణిలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే లక్ష్మణ సవది బంధువు అన్నప్ప బసప్ప నింబాలను లోక్ సభ ఎన్నికలకు ముందే వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపేశారు.
బెళగావి జిల్లా అథణి తాలూకా ఖిలేగావ్ గ్రామానికి చెందిన అన్నప్ప బసప్ప నింబాల అలియాస్ అన్నప్ప (58) హత్యకు గురైనాడని పోలీసులు తెలిపారు. గ్రామం శివార్లలోని ఖిలేగావ్-అథని జాతీయ రహదారిపై అన్నప్ప హత్యకు గురయ్యాడు. అన్నప్ప బసప్ప నింబాల అథణి తాలుకా కాంగ్రెస్ నాయకుడు. కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది కూడా సన్నిహితుడు అని, ఎమ్మెల్యేకి చాలా దగ్గరి బంధువు అని బెళగావి జిల్లా పోలీసులు తెలిపారు.

అన్నప్ప కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాకుండా ఖీలేగావ్ గ్రామ కృషి పట్టిన్ సంఘ్ కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, పత్తిపంట రైతు సంఘం నాయకుడిగా ఉన్నాడు. రాజకీయాల్లో ఎదుగుదల తట్టుకోలేక అన్నప్పను హత్య చేశారని అతని బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఖిలేగావ్ గ్రామ శివారులో దుండగులు మార్గం మధ్యంలో అన్నప్పను అడ్డగించి అతని మీద వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారు.
అయితే అన్నప్ప హత్యకు గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదని పోలీసు అధికారులు అంటున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అథణి డీఎస్పీ శ్రీపాద జల్దే పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటన అథణి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. అన్నప్ప హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బెళగావిలోని హిండలగ జైలులో బేడీలు, సిగరెట్లు, పొగాకు లభ్యం అయ్యాయి. బెళగావి డీసీపీ రోహన్ జగదీష్ ఆధ్వర్యంలో పోలీసులు నగరంలోని హిండలగ జైలుపై ఆకస్మిక దాడులు చేశారు. 150 మంది సిబ్బంది ఆకస్మికంగా జైలులో సోదాలు చేశారు. దాడి అనంతరం డీసీపీ రోహన్ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ ఏసీపీలు, 5 మంది ఇన్‌స్పెక్టర్లు, 146 మంది సిబ్బంది తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్‌తో వచ్చి జైలు మొత్తం తనిఖీ చేశామని అన్నారు. జైలులో జరుగుతున్న అక్రమాల గురించి వచ్చిన ఆరోపణలపై నిజమెంత అన్నది తెలుసుకునేందుకు డీసీపీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications