త్వరలో పన్నీర్ సెల్వం సీఎం: శశికళ అంతే, పాండ్యరాజన్ జోస్యం
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, త్వరలోనే ఆరోజు వస్తోందని తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ సెల్వం వర్గంలోని సీనియర్ ఎమ్మెల్యే పాండ్యరాజన్ జోస్యం చెప్పారు.
శనివారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే కార్యదర్శిగా శశికళ ఎంపిక ఆ పార్టీకి విరుద్దంగా జరిగిందని, పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆమె నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

శశికళ ఎంపికను ఎన్నికల కమిషన్ రద్దు చేసిన వెంటనే ఆయన స్థానంలో పన్నీర్ సెల్వం సూచించిన సీనియర్ నేతను ఎన్నుకుంటామని పరోక్షంగా అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ పేరు చెప్పారు.
త్వరలోనే తమిళనాడు ప్రభుత్వం కుప్పకూలుతుందని, ఇప్పుడు శశికళ గ్రూప్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వచ్చి మా వర్గానికి మద్దతు ఇస్తారని, అమ్మ ఆశీస్సులు, ప్రజలు ఆశీర్వాధంతో మళ్లీ పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి పాండ్యరాజన్ ధీమా వ్యక్తం చేశారు. శశికళ ఇక జైల్లో తాను తమిళనాడు సీఎం అవుతానని ఊహించుకుంటూ ఉండాల్సిందే అని అన్నారు.












Click it and Unblock the Notifications