తుపాకీతో కాల్చుకుని మాజీ ఎంపి ఆత్మహత్య
చెన్నై: తమిళనాడుకు చెందిన రాజ్యసభ మాజీ ఎంపి ఎన్ రాజేంద్రన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ట్యూటికోరిన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేంద్రన్ తన సొంత కారులో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉన్నాడు.
మాజీ ఎంపీ రాజేంద్రన్ తనంతట తానే కాల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తన ఇంటి సమీపంలో ఉన్న బస్టాండ్ దగ్గర ఎంపి కారు పార్క్ చేసి ఉంది. ఏఐడిఎంకే పార్టీకి చెందిన 62 ఏళ్ల రాజేంద్రన్ తన సొంత లైసెన్స్ రివాల్వర్‌తో పేల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు సుసైడ్ నోట్‌ను గుర్తించలేదు. కుటుంబ కలహాల వల్లే రాజేంద్రన్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. రాజ్యసభకు ఆయన 1996లో ఏఐఏడిఎంకే పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత డీఎంకే పార్టీలో చేరారు.
కుప్వారా జిల్లాలో ఉగ్రవాది మృతదేహం లభ్యం
జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాది మృతదేహం లభ్యమైంది. ఉగ్రవాది మృతదేహం వద్ద ఉన్న ఏకే 47తో సహా మందుగుండు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఉగ్రవాది మృతదేహం లభ్యం కావడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.












Click it and Unblock the Notifications