వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నావైపు 6గురు: పన్నీరు, శశికళ పదవికి మాజీ కేంద్రమంత్రి ఎసరు

శశికళకు ఎమ్మెల్యేల మద్దతు లేదని, తన వద్దకు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం నాడు అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు ఎమ్మెల్యేల మద్దతు లేదని, తన వద్దకు ఇప్పుడు ఆరుగురు ఎమ్మెల్యేలు వచ్చారని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శుక్రవారం నాడు అన్నారు.

గవర్నర్‌తో డీజీపీ భేటీ: శశికళ బందించిన ఎమ్మెల్యేల గురించి ఆరా!గవర్నర్‌తో డీజీపీ భేటీ: శశికళ బందించిన ఎమ్మెల్యేల గురించి ఆరా!

ఈ రోజు మరోసారి పన్నీరు, ఆయన వర్గం చిన్నమ్మ పైన తీవ్రంగా మండిపడ్డారు. ఎమ్మెల్యేలు అందరూ తన వైపే ఉన్నారని పన్నీరు చెప్పారు. ఎమ్మెల్యేలను బందించడం చాలా బాధాకరమన్నారు. శశికళ క్యాంపు నుంచి వరుసగా తన వైపుకు వస్తున్నారని చెప్పారు.

Former union minister ponnusamy meets OPS

శశికళకు మాజీ కేంద్రమంత్రి పొన్నుస్వామి ఝలక్

శశికళకు మాజీ కేంద్రమంత్రి పొన్నుస్వామి శుక్రవారం నాడు షాకిచ్చారు. అన్నాడీఎంకే పార్టీని పన్నీరు సెల్వం మాత్రమే నడపగలరని వ్యాఖ్యానించారు. గవర్నర్ విద్యాసాగర రావు సమర్థత కలిగిన వ్యక్తి అని, మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.

శశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు, చిన్నమ్మకు ఊరటశశికళ 'సీఎం' కాకుండా ఆపండి: హడావుడి ఎందుకని సుప్రీం కోర్టు, చిన్నమ్మకు ఊరట

ముఖ్యమంత్రి పీఠం కోసం పావులు కదుపుతున్న శశికళకు.. పార్టీని పన్నీరు నడపగలడని పొన్ను స్వామి చెప్పడం ద్వారా చిన్నమ్మకు మొదటికే మోసం తెచ్చారని చెప్పవచ్చు.

మరోవైపు, శశికళ క్యాంపులోని 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పన్నీరు సెల్వం వర్గీయులు చెబుతున్నారు. ముప్పై మంది చొప్పున నాలుగు రిసార్టులలో శశికళ ఎమ్మెల్యేలను బందించారని ఆరోపిస్తున్నారు.

English summary
Former Union Minister Ponnusamy on Friday met Chief Minister O Panneerselvam in Tamil Nadu. He said that Panneruselvam can lead the AIADMK party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X