కీచక పర్వం: యుపిలో నాలుగు అత్యాచారం కేసులు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కీచకపర్వం కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో గురువారం నుంచి నాలుగు అత్యాచారాల కేసులు నమోదయ్యాయి.
నలుగురు బాధితుల్లో ముగ్గురు టీనేజర్లు కాగా, ఒక బాధితురాలు ఆరేళ్ల బాలిక. ఫీరోజాబాద్‌లోని ఫరిహా ప్రాంతంలో గురువారంనాడు మైనర్ ఆరేళ్ల బాలికను ఓ వ్యక్తి రేప్ చేశాడు. తన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఎత్తుకుపోయి బాలికపై అత్యాచారం చేశాడు.

అత్యంత దారుణమైన స్థితిలో బాలిక ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులకు విషయం తెలిసిందే. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఫరిహా పోలీసు స్టేషన్ శైలేంద్ర భరద్వాజ్ చెప్పారు.
ఈటాలో ఇద్దరు టీనేజ్ అక్కాచెల్లెళ్లు అత్యాచారానికి గురయ్యారు. వారిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. బగ్వాలా పోలీసు స్టేషన్ పరిధిలోని సియాపూర్ గ్రామంలో గురువారంనాడు ఈ సంఘటన జరిగింది. ముగ్గురు నిందితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
మరో సంఘటనలో ఓ టేనేజ్ అమ్మాయిపై మహరాజ్‌గంజ్ జిల్లాలోని నౌటన్వా ప్రాంతంలో పొరుగు వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికపై ఇంటిక పక్కన ఉండే మజర్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications