దారుణం: చేపలు ఇవ్వలేదని నలుగుర్ని కాల్చి చంపారు
పాట్నా: బీహార్ రాష్ట్రంలోని పాట్నా జిల్లాలోని అయిరా గ్రామంలో ఆదివారం దారుణం జరిగింది. చేపల గొడవ నలుగురి ప్రాణాలను తీసింది. రెండు వర్గాల మధ్య చేపల కోసం గొడవ జరిగింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న ఓ నీటి కుంటలో నలుగురు వ్యక్తులు చేపలు పట్టారు.
అయితే చేపలను తమకు కూడా ఇవ్వాలని అదే గ్రామానికి చెందిన కొందరు అగ్ర కులస్తులు చేపలు పట్టిన వ్యక్తులను అడిగారు. చేపలు ఇవ్వమని నిరాకరించడంతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే ఆ నలుగురు ప్రాణాలు వదిలారు.

ఈ ఘటనకు నిరసనగా మృతుల బంధువులు, గ్రామస్తులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.
ఘటనపై ఎస్ఎస్‌పి జితేంద్ర రాణా మాట్లాడుతూ.. ఘటనలో గాయపడిన వ్యక్తి ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే నిందితుల కోసం పలు ప్రాంతాలను గాలించామని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications