free sarees: ఉచిత చీరల కేసులో సీఎం సీరియస్, దెబ్బకు ఓనర్ అందర్, అనుమతి లేదు !
చెన్నై/తిరుప్పూర్: ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మృతి చెందారు. సుబ్రమణ్యస్వామికి ఎంతో పవిత్రమైన తైపూసం రోజు సందర్భంగా ఓ ప్రైవేట్ సంస్థ ఉచితంగా చీరలు అందజేస్తామని, ముందుగా టోకన్లు పంపిణి చేస్తామని. తరువాత వచ్చి చీరలు తీసుకోవాలని ప్రచారం చేసింది. వేల సంఖ్యలో మహిళలు గుమికూడారు. వేలాది మంది ప్రజలు ఒకేచోట గుమిగూడడంతో ఎక్కడ మాకు ఉచిత చీరల టోకన్లు చిక్కుతాయో లేదో అని ఒక్కసారిగా ఎగడటంతో అక్కడ తొక్కిసలా జరిగింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. ఈ సందర్బంలో నలుగురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనతో తమిళనాడు సీఎం ఎంకే. స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం ఆదేశాల మేరకు ఫ్యాక్టరీ ఓనర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

తైపూసం రోజు ఉచితంగా చీరలు పంపిణి
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఉచితంగా చీరలు పంపిణఇ చేస్తామని క్షషింగ్ కంపెన కంపెనీ కొన్ని రోజుల నుంచి ప్రచారం చేస్తోంది. తిరుపత్తూరు జిల్లాలోని వాణియంబాడి ప్రాంతంలో ప్రతి సంవత్సరం సుబ్రమణ్యస్వామికి ఎంతో పవిత్రమైన తైపూసం పౌర్ణమి రోజు తైపూసం రోజున వ్యాపారవేత్త అయ్యప్పన్ 5, 000 మంది పేద మహిళలకు ఉచితంగా చీరలు పంపిణి చెయ్యడం, అందరికి భోజనాలు వడ్డించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం ఆదివారం తైపూసం రోజు ఉచ్చింది. ఒక్కరోజు ముందుగా ఉచిత చీరలు తీసుకోవాలని అనుకునే వాళ్లు ఒక్కరోజు ముందుగా అంటే శనివారం వచ్చి టోకన్లు తీసుకోవాలని ఆ వ్యాపారవేత్త అయ్యప్పన్, ఆయన మద్దతుదారులు ప్రచారం చేశారు.

ఒక్కసారిగా వేల సంఖ్యలో మహిళలు వచ్చేశారు.
జిన్నపాలెం సమీపంలోని పారిశ్రామికవేత్త అయ్యప్పన్ కు చెందిన క్రిషింగ్ కంకర ఫ్యాక్టరీ సమీపంలోని ఖాళీ స్థలంలో ఉచిత చీరల కోసం శనివారం టోకెన్ జారీ చేశారు. ఈ టోకన్లు తీసుకోవడానికి వాణియంబాడి చుట్టుపక్కలలోని వివిధ గ్రామాల ప్రజలు మహిళలు వేల సంఖ్యలో జిన్నపాలెం సమీపంలోకి తరలివచ్చారు. దాదాపు 3 వేల మందికి పైగా మహిళలు ఖాళీ స్థలంలో గుమిగూడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొనింది. పారిశ్రామికవేత్త అయ్యప్పన్ ముందు జాగ్రత్త చర్యగా బ్యారికేడ్లు ఏర్పాటు చెయ్యకపోవడం, క్యూలైన్లు లేకపోవడంతో మహిళలు పోటీపడి చీరల కోసం ఇస్తున్న టోకన్లు తీసుకోవడానికి పోటీపడ్డారు.

నలుగురి ప్రాణాలు పోయాయి
ఉచిత చీరల కోసం టోకెన్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మహిళలు ముందుకు పరుగు తీశారు. ఆ సందర్బంలో కొందరు మహిళలు కిందపడిపోవడంతో సాటి మహిళలు వారి మీద తొక్కుకుంటా చీరల టోకన్లు తీసుకోవడానికి పోటీ పడ్డాడు. ఈ తొక్కిసలాటలో 20 మందికి పైగా మహిళలు స్పృహతప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో పడిఉన్న మహిళలను వెంటనే రక్షించి వాణియంబాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరిన 10 మంది మహిళల్లో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. మరో 6 మంది ఇప్పటికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు.

అధికారులు అనుమతి ఇచ్చారా ?
వాణియంబాడి రెవెన్యూ కమిషనర్ ప్రేమలత, దేవాదాయ శాఖ కమిషనర్ సమక్షంలో విచారణ జరిపారు. తొక్కిసలాటలో చనిపోయిన నలుగురు మహిళలు వాణియంబాడి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారని అధికారుల తెలిపారు. ఉచిత చీరల పంపిణికి, టోకన్ల పంపిణికి సంబంధిత అధికారుల నుంచి పారిశ్రామివేత్త అయ్యప్పన్ అనుమతి తీసుకోలేదని వెలుగు చూసింది.

సీఎం స్టాలిన్ సీరియస్
ఉచిత చీరల పంపిణి కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు పేద మహిళలు చనిపోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో జనం గుమికూడటానికి సంబంధిత అధికారులు అనుమతి ఇచ్చారా ? అని సీఎం ఆరా తీశారు. నలుగురు మహిళలు చనిపోవడానికి కారణం అయిన వ్యక్తులను అరెస్టు చెయ్యాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన మహిళలకు తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. నలుగురు మహిళలు చనిపోవడానికి కారణం అయిన క్రషింగ్ కంపెనీ యజమాని, కంకర ఫ్యాక్టరీ ఓనర్ అయ్యప్పన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications