మాండ్యలో ఫ్రెండ్స్‌తో కలిసి స్నేహితురాలిపై గ్యాంగ్‌రేప్, అరెస్ట్
మాండ్య: బెంగళూరులో కాల్ సెంటర్ ఉద్యోగిని పైన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మరవకముందే మరో సామూహిక అత్యాచారం వెలుగు చూసింది. ఈ సంఘటన మాండ్య సమీపంలో జరిగింది. ఇందుకు సంబంధించి నలుగురు యువకులను పోలీసులు ఆదివారం నాడు అరెస్టు చేశారు.
అరెస్టైన వారంతా ఇరవై ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యకు చెందిన వారే. శుక్రవారం నాడు నిందితులు ఓ కాలేజ్ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ కేసుకు సంబంధించి ఆదివారం ఉదయం నలుగురు నిందితులను అరెస్టు చేశామని, వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇరవై ఏళ్ల బాధితురాలు శనివారం నాడు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు.

బాధితురాలి వయస్సు ఇరవై ఏళ్లు. నిందితులను కీర్తి గౌడ, కిరణ్, మోహన్, మంజులుగా గుర్తించారు. బాధితురాలికి నిందితుల్లో ఒకరైన కీర్తి గౌడ తెలిసిన వాడే. బాధితురాలు కీర్తి గౌడ ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
కీర్తి గౌడ తనను హిల్ టాప్‌కు తీసుకు వెళ్లాడని, వెనుక మిగతా ముగ్గురు నిందితులు కూడా వచ్చారని బాధితురాలు చెప్పారు. అయితే, సంఘటన ప్రాంతంలోనే ఉన్న మంజు మాత్రం ఆమె పైన అత్యాచారానికి పాల్పడలేదు.
యువతిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. విద్యార్థిని మైసూరూలో ఓ కళాశాలలో చదువుతోంది. పోలీసులు నిందితులకు చెందిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బైకులను వారు హిల్ టాప్‌లో అత్యాచారం చేసిన సమయంలో ఉపయోగించారు.












Click it and Unblock the Notifications