శబరిమల అయ్యప్ప భక్తులకు ఉచిత బస్సు సర్వీసులు, ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు !
శబరిమల ఆలయానికి భక్తులను తరలించేందుకు వాహనాలను ఉచితంగా ఇవ్వాలని, అయ్యప్ప భక్తులను ఉచితంగా తరలించేందుకు అనుమతించాలని కోరుతూ వీహెచ్‌పీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
దీనిలో వీహెచ్ పీ సంస్థ పిటిషన్‌ను తిరస్కరిస్తూ 2023 ఏప్రిల్ 13వ తేదీ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వీహెచ్ పీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సమయంలో వీహెచ్‌పీ తరఫున సీనియర్ న్యాయవాది వి.చితంబరేశ్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో, వృద్ధులు, పిల్లలతో సహా చాలా మంది భక్తులు శబరిమల అయ్యప్ప ఆలయానికి చేరుకోవడానికి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.

కాబట్టి వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడానికి వీహెచ్ పీ సిద్ధంగా ఉందని సుప్రీం కోర్టుకు మనవి చేసింది. గతంలో కేరళ రాష్ట్ర రోడ్డు మార్గం బస్సులు పంపా వద్ద అందుబాటులో ఉండేవి. అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప ఆలయానికి ఆరు కిలోమీటర్ల ప్రయాణం ఉంటుందని, కండీషన్ సరిగా లేని కేఎస్‌ఆర్‌టీసీ (కేరళ ఆర్ టీసీ )బస్సులు అయ్యప్ప భక్తుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీహెచ్ పీ కోర్టుకు చెప్పింది.
శబరిమలకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. కేఎస్‌ఆర్‌టీసీ (కేరళ ఆర్ టీసీ) బస్సుల కోసం క్యూలైన్లలో 28 నుంచి 30 గంటలకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని, కేరళ ప్రభుత్వం సరైన ఆర్ టీసీ బస్సుల సౌకర్యం కల్పించకపోవడంతో అయ్యప్ప భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని వీహెచ్ పీ న్యాయవాది కోర్టులో చెప్పారు. వీహెచ్ పీ న్యాయవాది చితంబరేశ్ అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ధర్మాసనం కేరళ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అంతేకాకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం మాత్రమే ఉండాలని, ప్రయాణికులను దారి మధ్యలో ఎక్కించుకోవద్దని సీనియర్ న్యాయవాదికి ధర్మాసనం తెలిపింది. దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన మతపరమైన పుణ్యక్షేత్రాల్లో శబరిమల కూడా ఒకటి. కోట్లాది మంది భక్తుల పూజలందుకుంటున్న అయ్యప్పను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెలుతుంటారు.












Click it and Unblock the Notifications