రైల్వే ప్రయాణికులకు ఉచితంగా భోజనం!!
తన ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. రైలు టికెట్ల నుంచి రైళ్లల్లో కల్పించే సదుపాయాల వరకు అనేక అంశాలపై మార్పులు చేస్తోంది. వీటిపై అవగాహన లేక ఆ ప్రయోజనాలను ప్రయాణికులు పొందలేకపోతున్నారు. రైల్వే తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఉచితంగా భోజనం అందించడం కూడా ఉంది. ప్రతిరోజు రైల్వేలో లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అంతమందికి ఉచితంగా భోజనం అందించడం సాధ్యమేనా అని అనుకోవచ్చు. అయితే కొందరు ప్రయాణికులకు మాత్రం ఉచిత భోజనం ఇస్తోంది.
అనుకున్న సమయంకన్నా ఆలస్యమైతే..
దురంతో, శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లల్లో ప్రయాణికులకు ఉచిత భోజనం లభిస్తుంది. కొన్ని కారణాలవల్ల రైళ్లు ఒక్కోసారి బాగా ఆలస్యంగా నడుస్తుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీమియం రైళ్లల్లో ప్రయాణించేవారికి ఇబ్బంది కలగకుండా రైల్వే ఉచిత భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండుగంటలకన్నా ఎక్కువ ఆలస్యంగా నడుస్తుంటే వారికి ఉచిత భోజనం లభిస్తుంది. చేరుకోవాల్సిన స్టేషన్ కు సమాయానికి రాకుండా ఆలస్యమైతే భోజనంతోపాటు డ్రింక్స్ అందిస్తుంది. ఈ ప్రీమియం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లయితే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ లాంటివి పొందుతారు.

వాట్సాప్ లో కూడా పొందొచ్చు
ప్రయాణికులు భోజనం కావాలనుకుంటే ఐఆర్‌సీటీసీ ఇ-కేటరింగ్ యాప్ ఫుడ్ ఆన్ ట్రాక్ లేదంటే www.catering.irctc.co.in వెబ్‌సైట్లలో ఆర్డర్ చేయొచ్చు. వాట్సప్‌లో కూడా సర్వీస్ ఇస్తున్నారు. 8750001323 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ పంపించి ఆహార పదార్థాలను పొందొచ్చు. అయితే ఈ సౌకర్యం కొన్ని రైళ్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన జూప్‌తో కలిసి వాట్సప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే సర్వీస్ ను ఐఆర్ సీటీసీ ప్రారంభించింది. రైల్వే ప్రయాణికులు జూప్ ఛాట్‌బాట్ నెంబర్ 7042062070 కి పీఎన్ఆర్ నెంబర్ మెసేజ్ చేసి ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు













Click it and Unblock the Notifications