వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థామస్‌చాందీ రాజీనామా: ఆ నివేదికే కీలకం, సివిల్స్‌లో అనుపమకు ఫోర్త్ ర్యాంక్

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కేరళ రవాణా శాఖ మంత్రి థామస్ చాందీ మంత్రి పదవి కోల్పోవడానికి అలప్పుఝా జిల్లా కలెక్టర్ టీవి అనుపమ. మంత్రిగా ఉన్న థామస్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి రిసార్ట్ కట్టుకోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రికి వ్యతిరేకంగా ఆమె ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కోర్టు కూడ మంత్రి తీరును తప్పబట్టడంతో చాందీ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

కేరళ రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన థామస్ చాందీ సరస్సులను పూడ్డి రిసార్ట్‌ను కట్టుకొన్నారు. భూకబ్జాల ఆరోపణలు కూడ ఆయన పై ఉన్నాయి. ఈ విషయమై అలప్పుఝా కలెక్టర్ టీవి అనపమ మంత్రి బండారాన్ని బట్టబయలు చేశారు.

అధికారంలో ఉన్న మంత్రి థామస్ చాందీ ఎన్ని బెదిరింపులకు పాల్పడిన ఆమె బెదరలేదు. ఈ తరుణంలో థామస్ చాందీపై ఆధారాలతో సహ రెవిన్యూ శాఖకు నివేదికను పంపింది.

 థామస్ చాందీ పదవిని కోల్పోవడానికి కలెక్టరే కారణమా?

థామస్ చాందీ పదవిని కోల్పోవడానికి కలెక్టరే కారణమా?

కేరళ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి గా పనిచేసిన థామస్ చాందీ భూ కబ్జాల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అందమైన సరస్సును పూడ్చి విలాసానికి రిసార్ట్‌ కట్టుకున్నారని థామస్ చాందీపై ఆరోపణలు వచ్చాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన థామస్ చాందీ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితులను అలప్ఫుఝా కలెక్టర్ టీవి అనుపమ కల్పించారు.మార్తాండం సరస్సును పూడ్చి మంత్రి థామస్‌ అక్రమంగా లేక్‌ ప్యాలెస్‌ నిర్మించటాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు.

మంత్రి, కలెక్టర్‌కు మధ్య విమర్శలు

మంత్రి, కలెక్టర్‌కు మధ్య విమర్శలు

అక్కడ ప్రకృతి అందాలతో విరజిల్లే మార్తాండం సరస్సును పూడ్చి మంత్రి థామస్‌ అక్రమంగా లేక్‌ ప్యాలెస్‌ నిర్మించటాన్ని కలెక్టర్ టీవి అనుపమ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై మంత్రి థామస్ చాందీకి కలెక్టర్‌ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. అయితే అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయమై ఆమె క్షేత్రస్థాయి నుండి నివేదికలను తెప్పించుకొంది. వాస్తవాలు నిర్ధారించుకొన్న తర్వాత రెవెన్యూ కార్యదర్శికి తుది నివేదికను సమర్పించారు.

 బెదిరించిన భయపడలేదు

బెదిరించిన భయపడలేదు

రెవిన్యూ శాఖకు కలెక్టర్ టీవి అనుపమ నివేదికను పంపిన తర్వాత ఆమెపై అనేక ఒత్తిళ్ళు వచ్చాయి. అయితే ఆమె మాత్రం ఒత్తిళ్ళను లెక్క చేయలేదు.ఈ నివేదికను తప్పుబడుతూ మంత్రి థామస్ చాందీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు వేశారు. కోర్టు కూడ ఈ విషయమై మంత్రి తీరును తప్పుబట్టింది. విపక్షాలతో పాటు ఎల్‌డిఎప్ లోని పక్షాలు కూడ థామస్ చాందీకి వ్యతిరేకంగా గళాన్ని విన్పించాయి. దరిమిలా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

 సోషల్ మీడియాలో అనుపమకు క్రేజీ

సోషల్ మీడియాలో అనుపమకు క్రేజీ

నిబంధనలకు విరుద్దంగా థామస్ చాందీ రిసార్ట్ నిర్మాణాన్ని కలెక్టర్ టీవీ అనుపమ వ్యతిరేకించారు. ఈ విషయమై ఆమె చూపిన ధైర్యానికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజీ వచ్చింది.మంత్రి పదవికి నాలుగు రోజుల క్రితం థామస్ చాందీ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన కబ్జా కట్టడాలను కూల్చివేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గోవా బిట్స్‌ పిలానీ క్యాంస్‌లో ఆమె ఉన్నత విద్యను అభ్యసించారు. బీఈలో 92 శాతం ఉత్తీర్ణత సాధించటం విశేషం. 2010 సివిల్స్‌ పరీక్షలో నాలుగో ర్యాంక్‌ను ఆమె సాధించారు.

English summary
When TV Anupama took charge as the District Collector of Alappuzha district in August 2017, no one in Kerala’s political circles could have imagined that she would rock the landscape by taking on a powerful minister in Pinarayi Vijayan’s cabinet.But Anupama set off a political storm in the state within weeks of her appointment, thanks to her report on the alleged land encroachment by Transport Minister Thomas Chandy, in violation of the Kerala Paddy and Wetland Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X