చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్లాట్‌ఫామ్‌‌పైనే ఆశ్రయం, కష్టాలను ఎదురొడ్డి సివిల్స్‌లో టాప్ ర్యాంకు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ చదువుకోవడం మానలేదు. రైల్వే ప్లాట్‌ఫామ్‌ మీద పడుకొని తాను అనుకొన్న లక్ష్యాన్ని చేరుకొన్నాడు. సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ తాను కన్న కలలను సాధించాడు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎం. శివగురు.

రెండు రోజుల క్రితం విడుదలైన సివిల్స్ పరీక్షల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎం. శివగురు సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంకులో నిలిచాడు. పూట గడవడంగా ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ చదువును మధ్యలోనే మానేసి తిరిగి కొనసాగించాడు. తాను పనిచేసిన డబ్బులతో తమ్ముడిని కూడ చదివించాడు.

రైల్వే ఫ్లాట్‌ఫామ్‌ మీదే శివగురు ఆశ్రయం పొందేవాడు. ఎన్ని కష్టాలొచ్చినా కానీ అతడు మాత్రం తన పట్టుదల వీడలేదు. వారాంతంలో రెండు రోజుల పాటు పేద విద్యార్ధులకు ఇచ్చే శిక్షణను తీసుకొన్నాడు.

సివిల్స్‌లో టాప్ ర్యాంకర్ శివగురు ప్రభాకరన్

సివిల్స్‌లో టాప్ ర్యాంకర్ శివగురు ప్రభాకరన్

తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పట్టుకొట్టయ్‌లోని మెలాఉత్తన్‌కాడు గ్రామానికి చెందిన ఎం. శివగురు సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించాడు. దేశంలోని యువతకు ఆయన ఆదర్శంగా నిలిచాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఆయన మాత్రం తన కలలను సాకారం చేసుకొనేందుకు వెనుకడుగు వేయలేదు.పెరియార్ ప్రభుత్వ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరారు. ఆ తర్వాత ముంబై ఐఐటీలో చేరాడు.పనిచేసుకొంటూ చివరకు సివిల్స్‌లో టాప్ ర్యాంకుకు చేరుకొన్నాడు.

పనిచేస్తూనే చదువు

పనిచేస్తూనే చదువు

శివగురు ప్రభాకరన్‌కు ఇంజనీరింగ్ చేయాలనేది తన అభిమతం. అయితే ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం చేతిలో చిల్లిగవ్వలేదు. తండ్రి మద్యానికి బానిసగా మారి కుటుంబం గురించి పట్టించుకోడు. తల్లి, అక్క కూలీ పనిచేసేవారు. ఇంటర్ పూర్తయ్యాక సామిల్లు ఆపరేటర్‌గా పనిచేశాడు శివగురు.అంతేకాదు వ్యవసాయం కూడ చేశాడు. తాను పనిచేస్తూ 2008లో తమ్ముడిని ఇంజనీరింగ్‌లో చేర్పించాడు అక్కకు పెళ్ళికి ఆర్ధికంగా తోడ్పాటును అందించాడు. పెరియార్ ప్రభుత్వ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాడు.

ఉచితంగా శిక్షణ పొందాడు

ఉచితంగా శిక్షణ పొందాడు

వెల్లూరు ప్రభుత్వ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాడు అయితే అదే సమయంలో ఐఐటీపై దృష్టి కేంద్రీకరించాడు. దీంతో చెన్నైకు వెళ్ళాడు. సెయింట్ థామస్ మౌంట్‌లో ఓ అధ్యాపకుడు వారంలో రెండు రోజుల పాటు పేద విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ ఇచ్చేవాడు ఈ శిక్షణకు ఆయన క్రమం తప్పకుండా హజరయ్యేవాడు. అయితే శిక్షణకు హజరైన సమయంలో సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపైనే ఆయన ఆశ్రయం పొందేవాడు. ఈ రెండు శిక్షణ కోసం రైల్వేస్టేషన్‌లోనే ఆయన సేద తీరేవాడు.

మొబైల్‌షాపులో పనిచేసేవాడు

మొబైల్‌షాపులో పనిచేసేవాడు

ఖాళీ సమయంలో మొబైల్ షాపులో పనిచేసేవాడు శివగురు. ముంబై ఐఐటీకి ఎంపికై 2014లో ఎంటెక్ పూర్తి చేశాడు. కుంభకోణం పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తంజావూరు కలెక్టర్‌గా పనిచేసిన రాధాకృష్ణన్ స్పూర్తితో ఐఎఎస్ కావాలని ఆయన నిర్ణయం తీసుకొన్నాడు.యూపీఎస్‌సీ పరీక్షలకు నాలుగో ప్రయత్నంలో ఆయన 101 ర్యాంకు సాధించాడు.

English summary
In 2004, M Sivaguru Prabakaran gave up his dream of pursuing an engineering degree as his family couldn’t afford the money to help him attend counselling session in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X