నేటి నుంచి రైళ్ల రద్దు: దక్షిణ మధ్య రైల్వే
ఒడిసాలో చోటుచేసుకున్న రైల్వే ప్రమాద ఘటన దృష్ట్యా జూన్ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కొన్ని రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దుచేసింది. ఇవన్నీ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరేవే. వేసవి సెలవులు ముగుస్తుండటంతో సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రయాణికుల రాకపోకలు తీవ్రంగా పెరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా రైళ్లను రద్దుచేయడంతో ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు.
కాచిగూడ-తిరుపతి (07061/07062), కాచిగూడ-కాకినాడ (07417 / 07418), కాచిగూడ-నర్సాపూర్ (07653 / 07654) ప్రత్యేక రైళ్లను మాత్రం ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. .

జూన్ 7 నుంచి 13 వరకు రద్దయ్యే రైళ్ల వివరాలు
కాచిగూడ-నిజామాబాద్ (07596)
నిజామాబాద్-కాచిగూడ (07593)
నాందేడ్-నిజామాబాద్ (07854)
నిజామాబాద్-నాదేడ్ (07853)
ఈరోజు రద్దయ్యేవి
కాచిగూడ-షాలిమార్-వాస్కోడిగామా (17603/18047)
షాలిమార్-హైదరాబాద్ (18045/18046)
వాస్కోడిగామా-షాలిమార్-కాచిగూడ (18048/17604). ఈ రైలు 9వ తేదీన కూడా రద్దు కానుంది. దౌండ్-నిజామాబాద్ (11409), నిజామాబాద్-పండరీపూర్ (01413) రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
ఒడిసాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇంకా గుర్తించని మృతదేహాలు 101 ఉన్నాయి. వీటిని భువనేశ్వర్ ఎయిమ్స్ లో భద్రపరిచారు. ఎక్కువ రోజులు ఉంచడానికి అవసరమైన సౌకర్యాలు అందులో లేకపోవడంతో ప్రత్యేకంగా కంటెయినర్లను అధికారులు తెప్పించారు. మృతదేహాలను వీటిల్లో భద్రపరుస్తారు. దాదాపు 2 నెలల నుంచి 3 నెలలవరకు అవి పాడవకుండా ఉంటాయి. ముఖం నలిగిపోవడం, కాళ్లు చేతులు తెగిపోవడంవల్ల గుర్తుపట్టలేని విధంగా ఇవి ఉన్నాయి. అందుకే మృతుల బంధువులు వారిని గుర్తించేందుకు సమయం పడుతుందనే ఉద్దేశంతో కంటైనర్లను పిలిపించారు.












Click it and Unblock the Notifications