వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: వరుసగా 12వ రోజు..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు ఇంకా ఇంకా ఎగబాకుతూనే ఉన్నాయి. వరుసగా 12వ రోజు కూడా ధరలు మరింత పెరిగాయి. గురువారం ముంబైలో మరో 36పైసలు పెరిగిన లీటరు పెట్రోల్ ధర రూ.85.65గా కొనసాగుతోంది.ఇక లీటరు పెట్రోల్ ధర 24పైసలు పెరిగి రూ.73.20గా కొనసాగుతోంది.

Recommended Video

మళ్ళీ రూ.4 పరిగిన పెట్రోల్ ధర

ఢిల్లీలో 36పైసలు పెరిగిన లీటరు పెట్రోల్ ధర రూ.77.83గా కొనసాగుతోంది. లీటరు డీజిల్ ధర 22పైసలు పెరిగి రూ.68.75గా కొనసాగుతోంది. కాగా, గడిచిన 12రోజుల్లో ముంబైలో పెట్రోల్ ధర రూ.11.02 పెరగ్గా.., డీజిల్ ధర రూ.7.27 పెరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నారు కానీ.. ఇప్పటికైతే ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

Fuel prices hiked for 12th day; petrol up over Rs 11 since Karnataka poll, diesel Rs 7.27

కాగా, అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ప్రస్తుతం బారెల్ ముడిచమురు ధర 78.76డాలర్లుగా ఉంది. దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలపై సబ్సిడీ తీసుకొస్తే ఆ ప్రభావం ఖజానాపై పడుతుందన్నారు.

వెనిజులా చమురు సంస్థలపై అమెరికా నియంత్రణ, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగుదల వంటివి పెట్రోల్ ధరల పెరుగుదల వెనుక కారణాలుగా చెబుతున్నారు.

వెనిజులా, ఇరాన్ చమురు ఎగుమతులపై కొనసాగుతున్న ఆంక్షల నేపథ్యంలో పెట్రోల్ ఎగుమతులు చేసే దేశాల ఆర్గనైజేషన్(ఓపీఈసీ) ధరలు పెంచడానికి సిద్దమవుతున్నట్టు చెబుతున్నారు.

కాగా, ఇండియాలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో చమురు ఎగుమతులు దిగుమతులకు ఇప్పుడు అంతరాయం నెలకొంది.

ఇండియన్ ఆయిల్ చైర్మన్ సంజీవ్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటికైతే ఇరాన్ నుంచి దిగుమతులను నిలిపివేయాల్సిందిగా చమురు సంస్థలకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. కాగా, ఇరాన్ నుంచి భారీ మొత్తంలో చమురు కొనగోలు చేస్తున్న సంస్థల్లో ఇండియన్ ఆయిల్(ఐఓసీ) ముందు వరుసలో ఉంది.

English summary
Petrol and diesel prices continue to soar and touched another peak on Thursday. Petrol was hiked by 36 paise to Rs 85.65 per litre in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X