పెట్రోల్ ధరలు త్వరలో తగ్గున్నాయి: ధర్మేంధ్రప్రధాన్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు తగ్గే సమయం ఆసన్నమైందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గత కొంతకాలంగా ధరలు పెరుగుతూ వచ్చాయని, దీనిపై ప్రజల్లో కొంత అసహనం కలిగిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు.
అమెరికాలో వరుస తుపానుల కారణంగానే ముడి చమురు ఉత్పత్తి తగ్గి ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం ఇప్పటికే మొదలైందని చెప్పారు.

మరికొన్ని రోజుల్లో తగ్గుదల స్పష్టంగా తెలుస్తుందని మంత్రి ధర్మేంధ్రప్రధాన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వస్తు సేవల పన్ను పరిధిలోకి 'పెట్రో' ఉత్పత్తులను చేర్చే అంశమై కసరత్తు జరుగుతోందన్నారు.
కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అడ్డుపడుతున్నాయని అన్నారు. వారి అభ్యంతరాలను పరిశీలించి, వ్యాపారులు, వాహనదారులకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకుంటామని ప్రధాన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications