Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: గాలి మెడకు సూసైడ్ నోట్: అజ్ఞాతంలోకి !

మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పుడు డెత్ నోట్ కష్టాలు మొదలైనాయి. డ్రైవర్ రమేష్ ఆత్మహత్య చేసుకునే ముందు రాసి పెట్టిన 11పేజీల డెత్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బళ్లారి/బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖా మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పుడు డెత్ నోట్ కష్టాలు మొదలైనాయి. డ్రైవర్ రమేష్ మండ్య జిల్లాలోని మద్దూరులో ఆత్మహత్య చేసుకునే ముందు రాసి పెట్టిన 11పేజీల డెత్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అందులో తన ఆత్మహత్యకు రెవెన్యూ శాఖ అధికారి (కేఏఎస్) భీమా నాయక్ మొదటి వ్యక్తి అని, అతను తనను చాల హింసించాడని రమేష్ పూర్తి వివరాలు రాసిపెట్టాడు. గాలి జనార్దన్ రెడ్డికి రూ. 100 కోట్ల పాత నోట్లను మార్పిడి చేసి రూ. 80 కోట్లు కొత్త నోట్లు ఇచ్చాడని రమేష్ రాసిపెట్టాడు.

మిగిలిన రూ. 20 కోట్లు కమీషన్ తీసుకున్న భీమా నాయక్ రూ. 50 లక్షలు పెట్టి వజ్రాల ఉంగరం (142565ఐడి) కొనుగోలు చేశాడని, కృష్ణయ్య శెట్టి అండ్ సన్స్ పేరుతో ఒక కోటి రూపాయలకు పైగా అక్రమ లావాదేవీలు చేశాడని డెత్ నోట్ లో వివరించాడు.

Gali converted black money for his daughter's lavish wedding ?

సుదర్శన్ సిల్క్స్ లో రూ. 50 లక్షల విలువైన దుస్తులు కొనుగోలు చేశాడని రాసిపెట్టాడు. భీమా నాయక్ సోదరుడు కృష్ణా నాయక్ పేరుతో రెండు ఖరీదైన కార్లు, మరో సోదరుడు అర్జున్ నాయక్ పేరు మీద ట్రవేరా కారు కొనుగోలు చేశాడని డెత్ నోట్ లో వివరించాడు.

పాత నోట్ల మార్పిడి కేసు దర్యాప్తు చెయ్యకుండా అడ్డుకోవడానికి రెవెన్యూ శాఖా మంత్రి పర్సనల్ సెక్రటరీ నాగరాజుకు రూ. 25 లక్షలు లంచం ఇచ్చాడని రాసిపెట్టాడు. బెంగళూరు, బెళగావి, హోసపేట, హగరి బోమ్మనహళ్ళి, మరియమ్మనహళ్ళిలో రూ. 100 కోట్లకు పైగా బినామీ పేర్లతో భీమా నాయక్ అక్రమ ఆస్తులు కొనుగోలు చేశాడని వాటి పూర్తి వివరాలు డెత్ నోట్ రాసి పెట్టాడు.

2016 అక్టోబర్ 28వ తేదీన పారిజాత గెస్ట్ హౌస్ లో గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారీ ఎంపీ శ్రీరాములుతో భీమా నాయ్ భేటీ అయ్యారని, 2018 లో జరిగే కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తే రూ. 25 కోట్లు ఇస్తానని డీల్ కుదుర్చుకున్నారని డెత్ నోట్ లో ఆరోపించాడు.

భీమా నాయక్ మాయం !

రమేష్ ఆత్మహత్య చేసుకున్న తరువాత కేఏఎస్ అధికారి భీమా నాయక్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బుధవారం విధులకు హాజరుకాలేదని అధికారులు అన్నారు. భీమా నాయక్ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, ఆయన కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.

గాలి అత్యంత సన్నిహితులలో భీమా ఒకరు ?

గాలి జనార్దన్ రెడ్డికి అత్యంత సన్నిహిత అధికారుల్లో భీమా నాయక్ ఒకరు అనే గుర్తింపు తెచ్చుకున్నారని అధికారులు అంటున్నారు. బళ్లారి జిల్లా హోస్ పేట తాలుకా మరియమ్మనహళ్లిలో జన్మించి న భీమా నాయక్ 2007 నుంచి రెండు సార్లు బళ్లారీ తహసిల్దారుగా పని చేశారు.

అప్పటి నుంచి గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహితుడు అయ్యాడని వెలుగు చూసింది. రమేష్ రాసిన లేఖలో భీమా నాయక్ తో పాటు అతని మరో డ్రైవర్ మహమ్మద్ పేరు ఉండటంతో ఇద్దరు మాయం అయ్యారు. ప్రస్తుతం పోలీసులు రమేష్ స్నేహితులను విచారిస్తున్నారు.

Gali converted black money for his daughter's lavish wedding ?

Gali converted black money for his daughter's lavish wedding ?

Gali converted black money for his daughter's lavish wedding ?
Gali converted black money for his daughter's lavish wedding ?
Gali converted black money for his daughter's lavish wedding ?
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+