బళ్లారి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి: సుప్రీంకు గాలి
న్యూఢిల్లీ: బళ్లారి వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై రెండు వారాల్లో అభిప్రాయం చెప్పాలని న్యాయస్థానం సిబిఐని ఆదేశించింది.
ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడైన ఆయనకు జనవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. పాస్‌పోర్టును సిబిఐ కోర్టులో అప్పగించాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతులు విధించింది.

దానికితోడు అనంతపురం, కడప, బళ్లారిలకు వెళ్లరాదని, కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి గానీ సాక్ష్యాలను తారుమారు చేయానికి గానీ పూనుకోవద్దని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆయనకు ఐదు షరతులు విధించింది. మూడేళ్ల నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications