ఢిల్లీలో ఢీ అంటే ఢీ... ఆరోపణలపై పరస్పరం కోర్టుకెక్కిన ఆప్, బీజేపీ..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఢిల్లీ సిద్ధమైంది. దేశ రాజధానిలో ఆదివారం పోలింగ్ జరగనుండగా.. తూర్పు ఢిల్లీ నియోజకవర్గ బీజేపీ, ఆప్ అభ్యర్థుల మధ్య విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారాయి. గంభీర్ తనను కించపరుస్తూ పాంప్లెంట్లు పంచుతున్నారని ఆప్ అభ్యర్థి అతిషి కన్నీళ్లు పెట్టుకుంటోంది. తమ పరువుతీసిన ఆయనపై కోర్టుకీడ్చుతున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆప్ నేతలపై కోర్టుకెక్కేందుకు సిద్ధమయ్యారు గౌతం గంభీర్.

నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా
ఆప్ నేత అతిషి చేసిన విమర్శలను తూర్పు ఢిల్లీ నియోజకవర్గ అభ్యర్థి గౌతం గంభీర్ తీవ్రంగా ఖండించారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే మరుక్షణమే పోటీ నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. 'ఆరోపణల్ని ఖండిస్తున్నా. మహిళల్ని గౌరవించాలని నా కుటుంబసభ్యులు చిన్నప్పుడే నేర్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఇంత దిగజారుతారని అనుకోలేదు. వారిపై పరువునష్టం కేసు దాఖలు చేశా'నని గంభీర్ ప్రకటించారు. 'కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఢిల్లీ సీఎంగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అని ట్వీట్ చేశారు.

నోటీసులు పంపిన గంభీర్
తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ఆప్ నేతలకు గంభీర్ నోటీసులు పంపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ నేత అతిషిలను కోర్డుకీడ్చుతానని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు చేసినందుకుగానూ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన గంభీర్.. లేనిపక్షంలో పరువునష్టం దావా వేస్తానని తేల్చిచెప్పారు.

కోర్టుకెళ్తామంటున్న ఆప్
ఆప్ నేత అతిషిని అవమానించిన గౌతం గంభీర్‌ను కోర్టుకీడ్చుతామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తాము తప్పుచేసి ఆప్ నేతలకు నోటీసులు పంపుతారా అని ఆగ్రహం వ్యక్తంచేసింది. 'మా పరువు తీసి మళ్లీ మాపైనే పరువునష్టం దావా వేస్తారా? బీజేపీ నేతలకే మేం పరువునష్టం నోటీసులు పంపుతున్నాం' అని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రకటించారు.

గంభీర్ వర్సెస్ అతిషి
ఢిల్లీ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో దిగిన గౌతం గంభీర్‌కు రెండు చోట్ల ఓటు హక్కు ఉందని ఆప్ నేత అతిషి ఆరోపించారు. దీనిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ఘటనపై గంభీర్ ఘాటుగానే స్పందించారు. ఇరువురు నేతల మధ్య అప్పుడు మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు కోర్టుకు చేరింది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications