నిమజ్జన వివాదం: వారణాసిలో రెచ్చిపోయిన సాధువులు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సాధువులు రెచ్చిపోయారు. గంగానదిలో గణేష్ నిమజ్జనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాధువులు తలపెట్టి ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసుల లాఠీఛార్జికి వ్యతిరేకంగా వారణాసిలో షాపులు, వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు.

 Violence in Varanasi after cops

గంగానదిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గణేశ్ ప్రతిమలను నదిలో నిమజ్జనం చేయడంపై అలహాబాద్‌ హైకోర్టు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోని కొంతమంది స్థానికులు సాధువులతో కలిసి వినాయక నిమజ్జనానికి గంగానదికి బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 Violence in Varanasi after cops

గంగానదిలో నిమజ్జనం కుదరదన్న పోలీసుల హెచ్చరికలను సాధువులు లేక్కచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు సాధువులపై లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీఛార్జీ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. ఆరోజు జరిగిన ఘర్షణలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జీపై వారణాసిలో సాధువులు సోమవారం ఆందోళనకు దిగారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఆందోళన ఈరోజు హింసాత్మకంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+