• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైప్రొఫైల్ మర్డర్: గ్యాంగ్‌స్టర్ కాల్చివేత - బంద్‌కు పిలుపు

|
Google Oneindia TeluguNews

జైపూర్: కొద్దిరోజుల కిందటే పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధు మూసేవాలా దారుణహత్యకు గురయ్యారు. రౌడీషీటర్లు ఆయనను తుపాకులను కాల్చి చంపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ హత్య వెనుక అతనిదే మాస్టర్ మైండ్ అంటూ పోలీసులు నిర్ధారించారు. అతని గ్యాంగ్‌ మొత్తాన్నీ ఏరివేసే పనిలో ఉన్నారు పంజాబ్ పోలీసులు.

తెలంగాణలో వ్యాపారం- ఏపీలో రాజకీయం: ఒకే సినిమాకు రెండు టైటిళ్లు..!!తెలంగాణలో వ్యాపారం- ఏపీలో రాజకీయం: ఒకే సినిమాకు రెండు టైటిళ్లు..!!

ఇప్పుడు తాజాగా రాజస్థాన్ అలాంటి హత్యోదంతమే చోటు చేసుకుంది. హైప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్ రాజు థెట్ హత్యకు గురయ్యాడు. అతని ఇంటి వద్దే బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు దుండగులు. ఈ హత్యలో కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉంది. ఈ హత్యను తానే చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హిస్టరీ రౌడీ షీటర్ రోహిత్ గొదారా ప్రకటించుకున్నాడు. ఇది తన పనేనని వివరించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.

 Gangster Raju Theth was shot dead near his residence at Sikar in Rajasthan

తన తమ్ముళ్లు ఆనంద్ పల్, బల్బీర్ బనుద హత్యలకు ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లు చెప్పాడు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ ఉదయం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సికార్‌ ఉద్యోగ్‌నగర్ ప్రాంతంలో రాజు థెట్‌ను కాల్చి చంపాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్లూ జీన్స్ ధరించిన రాజు థెట్ ఇంటి వద్ద నిల్చుని ఇద్దరు వ్యక్తులతో మాట్లాడుతుండటం ఈ వీడియోల్లో రికార్డయింది. అదే సమయంలో మరో ఇద్దరు వక్తులు అక్కడికి రావడం, ఓ ట్రాక్టర్‌ను అడ్డుగా పెట్టి- రాజు థెట్‌పై కాల్పులు జరపడం ఇందులో కనిపించింది. మూడు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. బుల్లెట్ గాయాలతో రాజు థెట్ సంఘటన స్థలంలోనే మరణించాడు. ఆ ప్రదేశం మొత్తం రక్తసిక్తమైంది.

ఈ హత్య తరువాత సికార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజు థెట్ మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు కుటుంబ సభ్యులు. హంతకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు తేజా సేన బంద్‌కు పిలుపునిచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. రాజు థెట్ అమర్ రహే అంటు నినాదాలు చేశారు. దుకాణాలను మూసివేయించారు.

English summary
Gangster Raju Theth was shot dead near his residence at Sikar in Rajasthan. Lawrence gang history-sheeter Rohit Godara has taken responsibility for Raju Theth's murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X