రాజ్యాంగబద్దంకాదు, చెల్లదు: సిబిఐపై హైకోర్టు సంచలనం

Gauhati high court declares CBI unconstitutional
గౌహతీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కు గౌహతీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సిబిఐ విషయంలో న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ సిబ్బంది పోలీసులే కాదని, వాళ్లు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, సోదాలు సాగించడం రాజ్యాంగ విరుద్ధమేనని సంచలన తీర్పు చెప్పింది. సిబిఐ ఏర్పాటుకు సంబంధించి 1963 ఏప్రిల్ 1వ తేదీన హోంశాఖ చేసిన తీర్మానాన్ని కొట్టి పడేసింది.

అసలు సిబిఐ ఏర్పాటే చెల్లదని తెలిపింది. జస్టిస్ ఐఏ అన్సారీ, జస్టిస్ ఇందిరా షాల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ తీర్పు చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సామగ్రి కొనుగోళ్లు, ఇతర లావాదేవీల్లో అవినీతి, అక్రమాలపై విచారణకు 1941లో బ్రిటిష్ ప్రభుత్వం 'ప్రత్యేక పోలీసు వ్యవస్థ' (ఎస్‌పిఈ) ఏర్పాటు చేసింది.

యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఈ వ్యవస్థను కొనసాగించారు. దీనిని ఢిల్లీ ప్రత్యేక పోలీసు వ్యవస్థ (డిఎస్‌పిఈ)గా మార్చి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని అంతు తేల్చే బాధ్యతను అప్పగించారు. ఆ తర్వాత 1963 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర హోంశాఖ ఒక తీర్మానం ద్వారా డిఎస్‌పిఈని సిబిఐగా మార్చింది. సిబిఐ జాతీయస్థాయి దర్యాప్తు సంస్థగా ఆవిర్భవించింది.

1963లో సిబిఐ ఏర్పాటుపై కేంద్ర హోంశాఖ చేసిన తీర్మానం కేంద్ర మంత్రివర్గ నిర్ణయం కాదని, ఈ ఆదేశాలపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లేదని ఈ తీర్మానాన్ని కేవలం శాఖాపరమైన సూచనలుగానే పరిగణించగలని, దానిని చట్టంగా చూడలేమని, అందువల్ల దోషపూరితమైన ఈ తీర్మానాన్ని కొట్టివేస్తున్నట్లు పేర్కొంది.

ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో సిబిఐ ఎంతమాత్రం భాగం కాదని, దానికి అనుబంధ విభాగమూ కాదని, 1946నాటి డిఎస్‌పిఈ చట్టం ప్రకారం ఏర్పాటైన సిబిఐని పోలీసు విభాగంగానే గుర్తించరాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. సిబిఐ కేసులు నమోదు చేయడం, నిందితుల పేరిట అరెస్టులు చేయడం, సోదాలు నిర్వహించడం, జప్తులకు దిగడం, నిందితులను ప్రాసిక్యూట్ చేయడం ఇలాంటివన్నీ రాజ్యాంగంలోని 21వ అధికరణకు విరుద్ధమే అని తెలిపారు.

తద్వారా సిబిఐ తీసుకునే చర్యలను రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తూ కొట్టివేయవచ్చునని స్పష్టం చేశారు. అయితే సిబిఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు తమ తీర్పు అడ్డంకి కాబోదని చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+