రాహుల్ భారత్ జోడో యాత్రలో గౌరీ లంకేష్ కుటుంబసభ్యులు: చేయి పట్టుకుని నడిచారు

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. ఆయనతో మహిళలు, యువతులు, చిన్నారులు, అనేక మంది కలిసి నడుస్తున్నారు. తాజాగా, హత్యకు గురైన జర్నలిస్టు గౌరీ లంకేశ్ సోదరి కవిత, తల్లి ఇందిరలు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని శుక్రవారం కలిశారు. ఆ తర్వాత ఆయన వెంట నడిచారు.

భారత్ జోడో యాత్ర లంకేష్ లాంటి వారి గొంతుక అని, దానిని ఎప్పటికీ మూయించలేమని అన్నారు కాంగ్రెస్ నేతలు. 'సత్యం కోసం గౌరీ ధైర్యంగా నిలబడ్డారు. గౌరీ స్వాతంత్ర్యం కోసం నిలబడ్డారు. నేను గౌరీ లంకేష్, ఆమె వంటి అసంఖ్యాకమైన భారతదేశ నిజమైన ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. భారత్ జోడో యాత్ర వారి గొంతు. ఇది ఎప్పటికీ నిశ్శబ్దం కాదు' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

 Gauri Lankeshs kin join Rahul Gandhi in his Bharat Jodo Yatra in Karnataka

చేయి పట్టుకుని లంకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తున్న చిత్రాన్ని షేర్ చేస్తూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 8న కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో వందల కిలోమీటర్లు ప్రయాణించింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ యాత్ర కొనసాగనుంది.

కాగా, జర్నలిస్ట్, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ సెప్టెంబరు 5, 2017 న దక్షిణ బెంగళూరులోని ఆమె నివాసం ముందు దుండగులు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. గౌరీ మరణం తరువాత, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ హత్యపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటకలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+