యువతి కిడ్నాప్: బలవంతంగా యాసిడ్ తాగించారు

వివరాల్లోకి వెళితే.. కారులో వచ్చిన ఇద్దరు దుండగులు కరన్‌పూర్ సమీపంలో బాధిత యువతిని అపహరించారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెతో బలవంతంగా యాసిడ్‌ను తాగించారు. అనంతరం ఆమెను భగవత్‌పూర్ దగ్గర పడేసి పరారయ్యారు.
ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ఈ దారుణానికి పాల్పడింది ఎవరో తమకు తెలియదని, ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అన్నారు. తాము ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వారు మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం బాధితురాలు స్థానిక ఎస్ఆర్ఎన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా తమకు ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని కౌషంబి పోలీసులు చెప్పారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఘటనపై దర్యాప్తు జరుపుతామని తెలిపారు.












Click it and Unblock the Notifications