పరీక్ష కోసమని వెళ్లి, ప్రియుడిని పెళ్లి చేసుకొని వచ్చింది

యువతి కుటుంబ సభ్యులు వికాస్ నగర్ సమీపంలోని కోత్వాలిలో జీవిస్తున్నారు. ఆమె పన్నెండో తరగతి చదువుతోంది. గత శుక్రవారం ఆమెకు వార్షిక పరీక్ష ఉంది. ఆ రోజు ఉదయం పరీక్ష రాసేందుకు యూనిఫాం వేసుకొని, తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని బయలుదేరింది.
అయితే, ఆ యువతి పరీక్షకు వెళ్లకుండా పక్కింట్లో ఉండే దేవాశిష్‌తో కలసి ఓ గుడికి వెళ్లి పెళ్లి చేసుకుంది. పరీక్షకని వెళ్లిన కూతురు సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కంగారు పడి వికాస్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు.
తీరా తమ కూతురు పక్కింట్లోనే ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్లి చూడగా... ఎరుపు రంగు చీర ధరించి, నుదుటిపై సింగారపు బొట్టు, మెడలో మంగళ సూత్రంతో కనిపించింది. తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాదు, తాను మేజర్ అని, హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నానని పోలీసులకు ఆధారాలు చూపించింది. తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లనని పోలీసులకు చెప్పింది.












Click it and Unblock the Notifications