నిరుడు వక్షోజాల కోసివేత: మానసిక వైకల్యంతో మహిళ

Girl whose breasts were chopped off by pimp suffers acute psychiatric problem
న్యూఢిల్లీ: తార్పుడుగాళ్ల చేతిలో వక్షోజాల నరికివేతకు గురైన 23 ప్రస్తుతం తీవ్ర మనోవైకల్యంతో బాధపడుతోంది. వ్యభిచారం చేయడానికి నిరాకరించినందుకు నిరుడు భీవండికి చెందిన మహిళ వక్షోజాలను తార్పుడుగాళ్లు కోసేశారు. ప్రస్తుతం ఆమె ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఆ మహిళకు నిపుణుల చేత చికిత్స అందించాలని ఆ ఆస్పత్రి సుప్రీంకోర్టుకు మంగళవారం తెలిపింది. ఆ మహిళను ఢిల్లీకి చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లీడ్ సైన్సెస్‌కు తరలించాలని న్యాయమూర్తులు రంజన్ గోగోయ్, ఎంవై ఇక్భాల్‌లతో కూడిన బెంచ్ ఆదేశించింది. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స ముగించిన తర్వాత అక్కడికి మార్చాలని ఆదేశించింది.

అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను జులై 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును మహారాష్ట్ర పోలీసులు సమర్పించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఓ మహిళా పింప్ ఆ మహిళను వ్యభిచారంలోకి దించాలని ప్రయత్నించింది. ఆయితే ఆ మహిళ అంగీకరించలేదు. దీంతో మహిళా పింప్, మరో ఇద్దరు పురుషుల సహకారంతో ఆమె వక్షోజాలను కోసేసింది. అప్పట్లో ఈ సంఘటనను టైమ్స్ ఆఫ్ ఇండియా వెలుగులోకి తెచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+