ఈవీఎంల ట్యాంపరింగ్ ను నిరూపిస్తా: ఈసీకి కేజ్రీవాల్ సవాల్
ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ:ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. తనకు 72 గంటల సమయమిస్తే ఈవీఎంల సమాచారాన్ని తారుమారు చేయగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ విషయమై మరోసారి చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల సందర్భంగా ఏ మీట నొక్కినా బిజెపికే ఓటు పడినట్టుగా అధికారులు గుర్తించారు.ఈ విషయమై విపక్షాలు అధికార బిజెపిపై విరుచుకుపడ్డాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో కూడ బ్యాలెట్ పత్రాలను ఉపయోగించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

తనకు 72 గంటల సమయాన్ని కేటాయిస్తే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపిస్తానని అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు.
ఈసీ, నిపుణులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే తాను నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. బ్యాలెట్ పేపర్లు తప్ప మరో ఆఫ్షన్ లేదన్నారాయన.












Click it and Unblock the Notifications