బంపర్ ఆఫర్.. రూ.349కే విమాన ప్రయాణం
కేవల రూ.349తోనే విమాన ప్రయాణం చేయొచ్చు. అసోంలోని లిలాబారి నుంచి తేజ్ పూర్ వరకు ప్రయాణించడానికి 50 నిముషాల సమయం పడుతోంది. దీనికి రూ.349 వసూలు చేస్తున్నారు. అదనంగా ఎటువంటి రుసుము వసూలు చేయరు. కేవలం రూ.349 చెల్లిస్తే చాలు. ఇందులో బేస్ ఛార్జి రూ.150 కాగా, కన్వీనియెన్స్ ఛార్జీ రూ.199గా ఉంది. రూ.వెయ్యి కంటే తక్కువ బేస్ టికెట్ ధరతో దేశంలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇవన్నీ ప్రాంతీయ విమాన అనుసంధానత పథకం (ఉడాన్) కింద కొనసాగుతున్నాయి.
ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విమానాయన సంస్థలకు అనేకరకాల ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. అదే కారణమని ట్రావెల్ పోర్టల్ ఐక్సిగో వెల్లడించింది. ప్రతి మనిషికి రూ.వెయ్యి కంటే తక్కువ బేస్ ఛార్జీతో దేశంలో 22 విమాన మార్గాలున్నాయి. లిలాబరి-తేజ్ పూర్ మధ్య చాలా తక్కువగా రూ.150 బేస్ ఛార్జి ఉంది. అలయన్స్ ఎయిర్ వీటిని నడుపుతోంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే బేస్ ఛార్జీకి అదనంగా కన్వీనియన్స్ ఛార్జీలు వసూలు చేస్తారు. ప్రాంతీయ అనుసంధానత పథకం కింద నడిచే విమానాల ప్రయాణ సమయం 50 నిముషాలే ఉంటుంది.

రూ.150- 199 బేస్ ఛార్జీ మార్గాలు ఎక్కువగా మనదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నాయి. దక్షిణ భారతంలో బెంగళూరు-సేలం (రూ.525), కొచ్చి-సేలం మార్గాల్లో తక్కువ ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి. గువాహటి- షిల్లాంగ్ మధ్య బేస్ టికెట్ రూ..400గా ఉంది. అలయన్స్ ఎయిర్ తన మొదటి విమానాన్ని 1996లో ఏప్రిల్ 15న ప్రారంభించింది. దేశంలోని వివిధ చిన్న నగరాల నుంచి తర్వాత స్థాయి నగరాలకు కనెక్షన్లను అందించడం కోసం సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా 44 గమ్యస్థానాలకు విమానాలను తిప్పుతోంది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ వాయుదూత్ ఎయిర్‌లైన్స్ , ప్రాంతీయ విమాన మార్గాలకు సేవలందించేందుకు అలయన్స్ ఎయిర్ తో విలీనమైంది.












Click it and Unblock the Notifications