TrainAccident: మధ్యప్రదేశ్‍లో ఘోర రైలు ప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న ట్రైన్లు..
మధ్యప్రదేశ్ లో బుధవారం రైలు ప్రమాదం(TrainAccident) జరిగింది. ఉదయం 7 గంటలకు షాడోల్(Shahdol)లోని సింగ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక లోకో పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
రైళ్లు ఢీకొన్న వెంటనే గూడ్స్ రైలు పవర్ (ఇంజిన్)లో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వైద్యుల బృందాన్ని ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమి చికిత్స చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదానికి సంబంధించి రైల్వే అధికారులు విచారణ చేస్తున్నారు. అగ్నిమాపక బృందం, రైల్వే రెస్క్యూ టీం దాదాపు రెండు గంటల పాటు శ్రమించి లోకో పైలట్ మృతదేహాన్ని బయటకు తీశారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి.
కట్ని నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్లే సంపర్క్ క్రాంతి షాడోల్‌లోనే నిలిపివేశారు. ప్రయాణికులను షాహ్‌దోల్ నుంచి బిలాస్‌పూర్‌కు 15 బస్సుల ద్వారా తరలించారు. ప్రమాదం ప్రమాద వార్త తెలిసిన వెంటనే, RPF, GRPF బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం చేసేలా రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. ప్రమాదం కారణంగా సంపర్క్ క్రాంతి కట్నీ నుండి బిలాస్‌పూర్, చిర్మిరి కట్నీ MEMO, అంబికాపూర్ జబల్‌పూర్, బిలాస్‌పూర్ కట్నీ MEMU, బిలాస్‌పూర్ షాహ్‌దోల్ లోకల్, నర్మదా ఇండోర్ బిలాస్‌పూర్, బరౌని గోండియా రైళ్లు సహా దాదాపు అరడజను రైళ్లు నిలిచిపోయాయి. సింగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోని మూడో లైన్‌లో బొగ్గు లోడ్‌తో కూడిన గూడ్స్ రైలు నిలబడి ఉండగా, బిలాస్‌పూర్ నుంచు వస్తున్న గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్‌ను క్రాస్ చేసి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో మొత్తం ఐదు గూడ్స్ రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయి. బిలాస్‌పూర్ నుంచి షాహ్‌దోల్‌కు వెళ్లే రైలు నంబర్ 08740 బిలాస్‌పూర్-షాహ్‌దోల్ MEMU ఏప్రిల్ 19, 2023న రద్దు చేశారు. షాహ్‌దోల్ నుంచి అంబికాపూర్ వరకు నడిచే రైలు నంబర్ 08749 షాహ్‌దోల్-అంబికాపూర్ MEMU 19 ఏప్రిల్ 2023న రద్దు అయింది. అంబికాపూర్ నుండి అనుప్పూర్ వరకు నడిచే రైలు నంబర్ 08758 అంబికాపూర్-అనుప్పూర్ MEMU 19 ఏప్రిల్ 2023న రద్దు చేశారు. అనుప్పూర్ నుంచి మనేంద్రగఢ్ వరకు నడిచే రైలు నంబర్ 08759 అనుప్పూర్-మనేంద్రగర్ MEMU 19 ఏప్రిల్ 2023న రద్దు అయింది.
👉After installation of KAVACH ...a train anti collision technology .
— THE UPSC SHOW BY SAURAV (@theupscshow) April 19, 2023
Q.The question is KAVACH was installed here or not ???
👉Terrible train accident in Singhpur of Shahdol in #MadhyaPradesh, fire broke out after collision of two goods trains.#TrainAccident pic.twitter.com/fbsO5tuWc2
రైలు నంబర్ 08757 మనేంద్రగర్-అంబికాపూర్ MEMU మనేంద్రగర్ నుంచి అంబికాపూర్ వరకు 20 ఏప్రిల్ 2023న రద్దు చేశారు. రైలు నంబర్ 08750 అంబికాపూర్ నుంచి షాహదోల్ వరకు నడిచే అంబికాపూర్-షాహ్‌దోల్ MEMU 20 ఏప్రిల్ 2023న రద్దు అయింది. షాహ్‌దోల్ నుంచి బిలాస్‌పూర్ వరకు నడిచే రైలు నంబర్ 08739 షాహ్‌దోల్-బిలాస్‌పూర్ MEMU 19 ఏప్రిల్ 2023న రద్దు చేశారు. రైలు నంబర్ 18576 అంబికాపూర్ నుంచి షాహదోల్ వరకు నడిచే అంబికాపూర్-షాహ్‌దోల్ 19 ఏప్రిల్ 2023న రద్దు అయింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications