• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీకా ఉత్సవ్‌ అట్టర్‌ ప్లాప్‌-సోనియా సూచన- విదేశీ వ్యాక్సిన్లకు కేంద్రం సై

|

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ విధించలేని పరిస్దితులు, అలాగని దేశీయంగా తయారైన వ్యాక్సిన్లనే నమ్ముకుని వేచి చూసే పరిస్దితులు లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయానికి పచ్చజెండా ఊపేందుకు సిద్ధమవుతోంది. విదేశాల్లో తయారై ఇప్పటికే అక్కడ వాడుతున్న వ్యాక్సిన్లను భారత్‌లోనూ అనుమతించడం ద్వారా వ్యాక్సిన్ల కొరత విమర్శల నుంచి కాస్తయినా ఊరట దక్కుతుందని కేంద్రం భావిస్తోంది.

టీకా ఉత్సవ్‌ అట్టర్‌ ప్లాప్‌

టీకా ఉత్సవ్‌ అట్టర్‌ ప్లాప్‌

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో దేశీయ తయారీ సంస్ధలు సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లకు కేంద్రం అత్యవసర వాడకానికి అనుమతి ఇచ్చింది. కేంద్రం చేపట్టిన దేశవ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో వీటిని విరివిగా వాడటం మొదలుపెట్టారు. అయితే పలు రాష్ట్రాల్లో సరైన స్పందన లేకపోవడంతో వ్యాక్సిన్లు మురిగిపోయే పరిస్ధితి వచ్చింది. దీంతో కేంద్రం విదేశాలకు విచ్చలవిడిగా ఎగుమతులు చేయడం ప్రారంభించింది. చివరికి కరోనా సెకండ్‌ వేవ్ ప్రారంభం కావడంతో పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీనికి కేంద్రమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో టీకా ఉత్సవ్‌ను ప్రకటించిన మోడీ.. వ్యాక్సిన్ల కొరతతో అభాసుపాలయ్యారు.

రష్యన్‌ స్పుత్నిక్‌ వీకి అనుమతి

రష్యన్‌ స్పుత్నిక్‌ వీకి అనుమతి

దేశీయ తయారీ సంస్ధలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ప్రస్తుతం డిమాండ్‌కు తగినంతగా లేకపోవడంతో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తగినంత సమయం ఉన్నా వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలో కేంద్రం ఆయా సంస్దలకు తగిన మార్గదర్సకాలు ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్రం తాజాగా హడావిడిగా రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్ వీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయినా ఇది కూడా పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉండటంతో మరిన్ని విదేశీ వ్యాక్సిన్లవైపు చూడాల్సిన పరిస్దితి.

అన్ని విదేశీ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్‌

అన్ని విదేశీ వ్యాక్సిన్లకు గ్రీన్‌సిగ్నల్‌


తాజా పరిస్దితుల నేపథ్యంలో వ్యాక్సిన్ల డిమాండ్‌ను తట్టుకోవాలంటే అన్ని విదేశీ వ్యాక్సిన్లకు అనుమతివ్వక తప్పని పరిస్ధితి ఎదురైంది. దీంతో కేంద్రం విదేశాల్లో తయారై ఇప్పటికే అక్కడ విజయవంతంగా వాడుతున్న అన్ని వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు డీజీసీఐ అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయా వ్యాక్సిన్ల తయారీ సంస్ధలను కోరుతున్నట్లు తెలుస్తోంది. వారు దరఖాస్తు చేసుకోగానే వెంటనే అనుమతులు ఇవ్వడం ద్వారా సాధ్యమైనంత త్వరగా దేశంలో విదేశీ వ్యాక్సిన్లకు ద్వారాలు తెరవాలని కేంద్రం భావిస్తోంది.

అనుమతులు ఇచ్చే వ్యాక్సిన్లు ఇవే

అనుమతులు ఇచ్చే వ్యాక్సిన్లు ఇవే

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరతపై కేంద్రాన్ని పదేపదే విపక్షాలు టార్గెట్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్‌ అదినేత్రి సోనియాగాంధీ.. తాజాగా ప్రధానికి రాసిన లేఖలో దేశీయంగా వ్యాక్సిన్ల కొరత ఉంచుకుని విదేశాలకు ఎగుమతి చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో విదేశీ వ్యాక్సిన్లు దిగుమతి చేసుకుంటే నష్టమేంటని ప్రశ్నించారు. దీంతో కేంద్రం ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం ఈ ఏడాది మొత్తం ఐదు విదేశీ వ్యాక్సిన్లకు అనుమతిచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటిలో జాన్సన్ అండ్‌ జాన్సన్‌, జైడూస్‌ క్యాడిలా, సీరం నోవావ్యాక్స్‌, భారత్‌ బయోటెక్‌కు చెందిన మరో విదేశీ వ్యాక్సిన్ ఉన్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన స్పుత్నిక్‌కు ఇప్పటికే అనుమతి ఇచ్చారు.

English summary
The Centre has fast-tracked emergency approvals for foreign produced COVID-19 vaccines that have been in use in other nations. The plan is to expand the basket of vaccines for domestic use and increase the pace and coverage of vaccination amid a raging second wave of Covid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X