వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రానికి గవర్నర్ నివేదిక, న్యాయనిపుణులతో చర్చ, కుర్చీ ఎవరికీ?

తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రానికి నివేదిక పంపారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రానికి నివేదిక పంపుతున్నారు.

గురువారం సాయంత్రం తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గవర్నర్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు.రాత్రి ఏడున్నర గంటలకు శశికళ గవర్నర్ తో సమావేశమయ్యారు.

శశికళ వెంట ఎనిమిది మంది మంత్రులు కూడ రాజ్ భవన్ కు వెళ్ళారు. తనకు మద్దతిస్తోన్న ఎంఏల్ఏల సంతకాలతో కూడ లేఖలను ఆమె గవర్నర్ కు సమర్పించారు శశికళ.

అయితే శశికళ సమర్పించిన ఎంఏల్ఏల లేఖలు కూడ ఫోర్జరీ లేఖలే అని పన్నీర్ సెల్వం ఆరోపించారు.అయితే ప్రస్తుతం గవర్నర్ కోర్టులో బంతి ఉంది.

అన్నాడిఎంకెలో రెండు గ్రూపుల వాదనలను గవర్నర్ విద్యాసాగర్ రావు విన్నారు.రెండు గ్రూపుల వాదనలను విన్న తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్రానికి గవర్నర్ విద్యాసాగర్ రావు కేంద్రానికి నివేదిక పంపనున్నారు.

vidya sagar rao

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఏం చేయవచ్చనే అంశంపై గవర్నర్ న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు శుక్రవారం నాడు న్యాయనిపుణులతో చర్చించే అవకాశం ఉంది.

ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందనే ఆందోళన అన్నాడిఎంకె కార్యకర్తల్లో ఉంది.అయితే గవర్నర్ ఏం నిర్ణయం తీసుకొంటారోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

English summary
governor vidyasagar rao sending a report to Centre on tamilnadu crises.centre will take a call
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X