సాయి పల్లవికి ఏడుపు ఒక్కటే తక్కువా ? "ఏక్ దీన్" థియేటర్లన్నీ ఖాళీ !!
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి "సాయి పల్లవి". తన సహజమైన నటన, డ్యాన్స్ స్కిల్స్, ప్రత్యేకమైన ఇమేజ్‌తో అభిమానులను సొంతం చేసుకున్నారు. గ్లామర్ షో కి దూరం ఉంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. అందుకే టాలీవుడ్ ప్రేక్షకులు ప్రేమతో ఆమెను "లేడీ పవర్ స్టార్" అని పిలుస్తారు. సౌత్‌లో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ఆమె.. ప్రస్తుతం బాలీవుడ్‌లో సైతం పలు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
బాలీవుడ్ ఎంట్రీ..
అయితే సాయి పల్లవి బాలీవుడ్ అరంగేట్రంపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్‌తో జతకట్టిన 'ఏక్ దిన్' (Ek Din) చిత్రం ద్వారా ఆమె హిందీ తెరకు పరిచయమైంది. అయితే ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. సౌత్ ఇండియాలో వరుస విజయాలు అందుకున్న సాయి పల్లవికి, ఈ సినిమాతో విజయ పరంపరకు అనూహ్యంగా బ్రేక్ పడింది.

వసూళ్లలో వెనుకబాటు..
ట్రేడ్ వర్గాల నివేదికల ప్రకారం, 'ఏక్ దిన్' ఓపెనింగ్ వీకెండ్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం ₹3.88 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్, అమీర్ ఖాన్ వారసుడి ఎంట్రీ ఉన్నా, ఈ స్థాయి తక్కువ వసూళ్లు రావడం సినీ విశ్లేషకులను విస్మయానికి గురిచేసింది. కథలో బలం లేకపోవడం, నెమ్మదైన కథనం కారణంగా తొలి ఆట నుంచే ప్రేక్షకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చిందని భావిస్తున్నారు. ఇదే రకంగా కొనసాగితే.. సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమై, భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
అలానే ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం ప్రమోషన్ల లోపమని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం ప్రెస్ మీట్లు లేదా సోషల్ మీడియాలో భారీ ప్రచారం నిర్వహించకపోవడం వల్ల చాలా మందికి సినిమా విడుదలైన విషయమే తెలియలేదని అంటున్నారు. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రాన్ని 'ఒక రోజు' పేరుతో విడుదల చేసినా, సరైన పబ్లిసిటీ లేక థియేటర్ల వద్ద సందడి కరువైందని చెబుతున్నారు.
ఆశలన్నీ 'రామాయణ్' పైనే..
ఇక ఒకటి రెండు పరాజయాలతో వెనక్కి తగ్గే నటి కాదు సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ రణబీర్ కపూర్‌తో కలిసి నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'రామాయణ్' పైనే ఉన్నాయి. ఇందులో సీత పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండటంతో, బాలీవుడ్‌లో తిరిగి తన సత్తా చాటి గట్టి కమ్-బ్యాక్ ఇవ్వాలని సాయి పల్లవి లక్ష్యంగా పెట్టుకున్నారు.
సినీ కెరీర్..
మలయాళంలో "ప్రేమమ్" సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు సాయి పల్లవి. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన "ఫిదా" కూడా భారీ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగారు. అనంతరం వరుసగా ఎంసీఏ, పడి పడి లేచే మనసు, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వంటి సినిమాల్లో నటించి నటిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్ సరసన నటించిన "అమరన్" సినిమా ఘనవిజయం సాధించింది. అలాగే తెలుగులో నాగచైతన్యతో కలిసి నటించిన "తండేల్" కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.












Click it and Unblock the Notifications