క్రిస్పీగా, టేస్టీగా అరటికాయ వేపుడు ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు!

అరటికాయ వేపుడు రుచి తెలిసిన వారికి చాలా ఇష్టం అయిన వంటకం. అరటికాయ వేపుడు సహజంగా తినని వారు ఒక్కసారి ఇలా ప్రత్యేక పద్ధతిలో చేస్తే ఇంట్లో అందరూ ఇంకా కావాలి, మళ్ళీ చెయ్ అని అని అడుగుతారు. ఒక్క ముద్ద కూడా మిగలకుండా తినేస్తారు. ఈ రెసిపీలో క్రిస్పీనెస్, కారం, మసాలా రుచి అన్నీ పర్ఫెక్ట్‌గా వస్తాయి.

కావాల్సిన పదార్ధాలు

కూర అరటికాయలు - 4
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు -1/4 స్పూన్
కారం - 1న్నర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
జీలకర్ర పొడి - ఒక స్పూన్
గరం మసాలా - అర టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1స్పూన్
పోపు గింజలు - 1 స్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 4 స్పూన్స్

Crispy Aratikaya Vepudu recipe Make raw banana fry this special way and no one will leave it

అరటికాయ వేపుడు ఇలా చేస్తే రుచి

అరటికాయ వేపుడు చేయటానికి ముందుగా మంచి పచ్చి అరటికాయలు తీసుకోండి. చాలా పచ్చిగా ఉన్నవి వేపుడుకు బాగా సరిపోతాయి. అరటికాయలను తొక్క తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా కోయండి. ముక్కలు మరీ మందంగా, మరీ పల్చగా కూడా ఉండకూడదు. అప్పుడే అరటికాయ వేపుడుకు రుచి వస్తుంది. కోసిన ముక్కలను నీళ్లలో వేసి ఉప్పు కలిపి 10 నిమిషాలు ఉంచాలి.

ఈ మసాలాతో అరటికాయ వేపుడుకు సూపర్ రుచి

ఇలా చేయడం వల్ల అరటికాయలోని జిగురు తగ్గి, అరటికాయ ముక్కల రంగు నల్లబడకుండా ఉంటుంది. తర్వాత బాగా నీరు వడకట్టి, శుభ్రమైన గుడ్డతో తుడవండి. పూర్తిగా పొడిగా ఉండాలి.
ఒక గిన్నెలో ఎర్ర కారం పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి. కావాలంటే కొద్దిగా సోయా సాస్ లేదా నిమ్మరసం కలిపితే రుచి మరింత పెరుగుతుంది.

అరటికాయ ఫ్రై క్రిస్పీగా రావాలంటే ఇలా చెయ్యండి

ఈ మసాలాను అరటికాయ ముక్కలపై పూసి బాగా కలపండి. 15-20 నిమిషాలు మారినేట్ అయ్యేలా ఉంచండి. ఇలా మారినేట్ చేసిన అరటికాయ ముక్కలను పాన్‌లో నూనె వేడి చేసి, అందులో వేసి మధ్యస్థ మంటపై వేయించండి. మధ్య మధ్య తిప్పుతూ వేయించాలి. ఎక్కువగా కలపకుండా వేయిస్తే అప్పుడే క్రిస్పీగా వస్తాయి. బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివర్లో కొద్దిగా నెయ్యి వేస్తే సువాసన ఇంకా బాగుంటుంది.

గోంగూర చికెన్ కర్రీ.. ఇలా చేస్తే అద్భుతః!
గోంగూర చికెన్ కర్రీ.. ఇలా చేస్తే అద్భుతః!

ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా అరటికాయ వేపుడు

కావాలంటే కరివేపాకు, ఎండు మిర్చి పోపు గింజలు వేసి మళ్ళీ పోపు వేయవచ్చు. ఈ వేపుడు అన్నంతో, రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుంది. అలాగే సాయంత్రం టిఫిన్‌గా కూడా సూపర్. దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ప్రతిసారి ఇలా చేస్తే ఇంట్లో అరటికాయ వేపుడు కావాలని అడుగుతూ ఉంటారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ అరటికాయ వేపుడు రుచి చెప్పలేనంత బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+