Film Expo India 2026:కొత్త ఫిల్మ్ మేకర్స్, క్రియేటర్లకు బిగ్ ఛాన్స్..!

భారతీయ సినీ రంగాన్ని,అత్యాధునిక సాంకేతికతను,క్రియేటర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చే బృహత్తర కార్యక్రమానికి దేశ రాజధాని న్యూఢిల్లీ సిద్ధమవుతోంది.ఆగస్టు 26 నుండి 30 వరకు ఢిల్లీలోని 'భారత్ మంటపం'(ITPO) వేదికగా ఐదు రోజుల పాటు "ఫిల్మ్ ఎక్స్‌పో ఇండియా 2026"అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ ఈవెంట్‌కు సంబంధించిన ముందస్తు "ఇన్‌ఫ్లుయెన్సర్ & మీడియా మీట్" ఆగస్టు 12న ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు విందూ దారా సింగ్,సందీప్ మర్వా,ప్రీతి సప్రూ,అనిల్ జార్జ్, గుర్చరణ్ సింగ్‌లతో పాటు నిర్వాహకుడు,ఎక్స్‌హోబజ్ (ExhoBuzz) సీఈఓ ముకేష్ కుమార్‌లు పాల్గొన్నారు.

మూడేళ్ల కష్టం.. ఎన్నో అవకాశాలు!
ఈ సందర్బంగా ఫిల్మ్ ఎక్స్‌పో ఇండియా మెంటార్ విందూ దారా సింగ్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌పో వెనుక మూడేళ్ల సుదీర్ఘ కృషి ఉందన్నారు.సాధారణ ఎగ్జిబిషన్‌లా కాకుండా,కొత్తగా పరిశ్రమలోకి రావాలనుకునే యువ కళాకారులు,నూతన దర్శకులు,స్టార్టప్‌లు,క్రియేటర్లకు ఇది సరికొత్త అవకాశాలను అందిస్తుందని స్పష్టం చేశారు.ముఖ్యంగా భవిష్యత్తులో సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (AI) పాత్ర ఇన్వెస్టర్లు,క్రియేటర్లను ఒకే చోట కలపడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.

film-expo-india-2026-new-platform-for-filmmakers-creators-and-cinema-startups

ఉత్తర భారత్‌లో సినిమా రంగానికి బూస్ట్:
AAFT యూనివర్సిటీ ఛాన్సలర్ సందీప్ మర్వా మాట్లాడుతూ..ఢిల్లీ-ఎన్‌సీఆర్ నోయిడాలు భారతదేశ చలనచిత్ర రంగానికి ఇస్తున్న తోడ్పాటును కొనియాడారు.సినిమా రంగానికి,MSME(చిన్న తరహా పరిశ్రమల)రంగానికి ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తుచేశారు.నటి ప్రీతి సప్రూ మాట్లాడుతూ..కొత్త తరం ప్రతిభను వెలికితీయడానికి సినీ ప్రముఖులందరూ ఈ వేదికకు మద్దతు ఇవ్వాలని కోరారు.

కథ రాయడం నుండి సినిమా విడుదల వరకు!
"ఫిల్మ్ ఎక్స్‌పో ఇండియా 2026" ప్రధాన ఉద్దేశం సినిమా మేకింగ్ లోని ప్రతి ఘట్టాన్ని కవర్ చేయడమే.

  • ఎవరెవరు పాల్గొనవచ్చు?: దర్శకులు,నటులు,ప్రొడక్షన్ హౌస్‌లు,OTT ప్లాట్‌ఫామ్‌లు,AI & టెక్నాలజీ కంపెనీలు,యానిమేషన్ & VFX నిపుణులు,ఫిల్మ్ స్కూల్స్,ఇన్వెస్టర్లు,కంటెంట్ క్రియేటర్లతో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాల ప్రతినిధులు ఈ ఎక్స్‌పోలో భాగస్వాములు కానున్నారు.
  • ముఖ్య ఆకర్షణలు: వర్క్‌షాప్‌లు,క్రియేటర్ల మీటింగ్స్,స్టార్టప్ షోకేస్‌లు,సాంస్కృతిక ప్రదర్శనలు మరియు AI ఆధారిత 'స్టోరీ టెల్లింగ్'పై ప్రత్యేక చర్చలు ఉంటాయి.

మీడియా భాగస్వాములుగా వన్‌ఇండియా,ఫిల్మీబీట్,డైలీహంట్:
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు అధికారిక మీడియా పార్టనర్లుగా OneIndia(వన్‌ఇండియా),Filmibeat(ఫిల్మీబీట్)ఇంకా Dailyhunt(డైలీహంట్)వ్యవహరిస్తున్నాయి.ఈ మూడు ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారతదేశంలోని 15 ప్రాంతీయ భాషలలో ఈ ఎక్స్‌పో విశేషాలు,ఇంటర్వ్యూలు మరియు కవరేజ్ కోట్లాది మందికి చేరువ కానున్నాయి.

ఈవెంట్ వివరాలు:

  • తేదీలు: ఆగస్టు 26 - 30, 2026
  • వేదిక: భారత్ మంటపం,ITPO,న్యూఢిల్లీ
  • ట్యాగ్‌లైన్: ఫిల్మ్ ఎక్స్‌పో ఇండియా - ఫ్రమ్ స్క్రిప్టింగ్ టు రిలీజింగ్

కొత్త తరం ఫిల్మ్‌మేకర్లు,డిజిటల్ క్రియేటర్లు మరియు సినిమా పరిశ్రమను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఈ ఎక్స్‌పో ఒక గొప్ప మైలురాయిగా నిలవనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+