రిఫ్రిజిరేటర్స్, ఏసీలతోపాటు 19వస్తువులపై దిగుమతి సుంకం పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బుధవారం దిగుమతుల సుంకాన్ని పెంచింది. అంతగా ముఖ్యం కానటువంటి వస్తువుల దిగుమతులకు కళ్ళెం వేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు ఈ చర్య దోహదపడుతుందని వెల్లడించింది.

19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచినట్లు, ఈ నిర్ణయం బుధవారం అర్దరాత్రి నుంచి అమలవుతుందని తెలిపింది. దీంతో ప్రజలు విమాన ప్రయాణాలు, రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఏసీలు, స్పీకర్లు, వాషింగ్ మిషన్లు వంటివాటి కోసం మరి కాస్త అదనంగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది.
10 కేజీల కన్నా తక్కువ బరువుగల ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లపై 20 శాతం సుంకం చెల్లించవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సుంకం 10 శాతం ఉండేది. అదేవిధంగా స్పీకర్లు, రేడియల్ కార్ టైర్లు, ట్రంక్స్, సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, గృహోపకరణాలు, షవర్ బాత్, సింక్, ప్లాస్టిక్‌తో తయారైన టేబుల్‌వేర్, కిచెన్‌వేర్‌లపై సుంకం పెరిగింది.
వేటిపై ఎంతంటే?
మెటల్ జ్యుయల్లరీ, సెమీ ప్రాసెస్డ్ డైమండ్స్,కొన్ని రకాల విలువైన రాళ్లపై 5శాతం నుంచి 7.5శాతానికి పెంపు
ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లు, టీవీలపై 10శాతం నుంచి 20 శాతం పెంపు
ప్లాస్టిక్ వస్తులపై10నుంచి 15శాతానికి పెంపు
సూట్‌కేసులపై 10 నుంచి 5శాతానికి పెంపు
ఏవియేషన్ టర్బైన్ ఆయిల్‌పై 5శాతం
షవర్ బాత్, సింక్లు, వాష్ బేసిన్, స్పీకర్లపై 10 శాతం నుండి 15 శాతం పెంపు
రేడియల్ కారు టైర్లపై 10 నుంచి 15శాతానికి
ఫుట్‌వేర్‌పై 20 నుం 25 శాతానికి పెంపు
కిచెన్‌వేర్‌పై 10నుంచి 15శాతానికి పెంపు












Click it and Unblock the Notifications