బడ్జెట్‌లో తగ్గనున్న పన్ను స్లాబ్‌లు, రేట్లు?: ఉద్యోగుల పన్నుపై ఈవై ఇండియా సర్వేలో ఇలా
న్యూఢిల్లీ: ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో ఆదాయపన్ను స్లాబ్‌లు రేట్లను తగ్గించనుందని, డివిడెండ్లపై ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను రేట్లను ఇలాగే కొనసాగించే అవకాశాలున్నాయని ప్రముఖ ట్యాక్స్ కన్సల్టెంట్ ఈవై ఇండియా చేసిన ముందస్తు బడ్జెట్ సర్వేలో వెల్లడించింది.
ఉద్యోగులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఇప్పటి వరకు విధిస్తూ వస్తోన్న రకరకాల పన్నుల స్థానంలో ఒక స్టాండర్డ్ డిడక్షన్ పన్ను విధానాన్ని అవలంభిస్తే బాగుంటుందని 59 శాతం మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారని పేర్కొంది.

జనవరిలో నిర్వహించిన ఈ సర్వేలో కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే కాకుండా వివిధ సంస్థలకు చెందిన సీఎఫ్‌వోలు, సీనియర్ ఆర్థికవేత్తల అభిప్రాయాలను కూడా తీసుకున్నట్లు ఈవై ఇండియా తెలిపింది.












Click it and Unblock the Notifications