జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీక్: గుజరాత్‌లో ఎగ్జామ్ వాయిదా, హైదరాబాద్ లింక్

గుజరాత్ పంచాయతీరాజ్ శాఖ(జీపీఎస్ఎస్‌బీ)లో జూనియర్ క్లర్క్ నియామకాల ఆదివారం జరగాల్సిన పోటీ పరీక్ష వాయిదా పడింది.

గాంధీనగర్: గుజరాత్ పంచాయతీరాజ్ శాఖ(జీపీఎస్ఎస్‌బీ)లో జూనియర్ క్లర్క్ నియామకాల ఆదివారం జరగాల్సిన పోటీ పరీక్ష వాయిదా పడింది. ప్రశ్నాపత్రం లీక్ కావడమే ఇందుకు కారణమని పంచాయతీ పరీక్ష బోర్డ్ వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ నిందిుతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మొత్తం 1181 పోస్టులకు గానూ నియామక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు పంచాయతీ బోర్డు తెలిపింది. 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 2995 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతని వద్ద ప్రశ్నాపత్రం లభించినట్లు తెలిపింది. ఆ తర్వాతే పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు పంచాయతీ బోర్డు తెలిపింది.

అభ్యర్థులకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ.. పరీక్షా కేంద్రాలకు వెళ్లవద్దని బోర్డు తెలియజేసింది. త్వరలోనే ఈ పరీక్షను త్వరలోనే నిర్వహిస్తామని వెల్లడించింది.

GPSSB Junior Clerk recruitment exam paper leaked, exam cancelled in Gujarat; case filed on a printing press in Hyderabad

కాగా, జూనియర్ క్లర్ ప్రశ్నాపత్రాన్ని హైదరాబాద్‌లోనే ముద్రించినట్లు తెలిసింది. ఈ మేరకు సదరు ప్రింటింగ్ ప్రెస్‌పై కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం. హైదరాబాద్ చేరుకున్న గుజరాత్ పోలీసులు.. కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

ప్రధాని నిందితుడితోపాటు మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరోవైపు, గుజరాత్ కు చెందిన ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్‌లోని పరీక్ష పేపర్లు ముద్రించిన ప్రెస్‌లో తనిఖీలు చేపట్టారు. లీక్‌పై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

మరోవైపు, ప్రశ్నాపత్రం లీక్ పై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. తరచూ ప్రశ్నాపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+