వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రాష్ట్రాలకు గ్రేడింగ్.. పుస్తకాల బరువు తగ్గేనా?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ప్రతిభ ఆధారంగా ఆయా రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇస్తామని కేంద్ర మానవ వనరులు, అభివృద్ధిశాఖ మంత్రి జవదేకర్ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 70 అంశాల ప్రతిపాదికన గ్రేడింగ్ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. పాఠప్రణాళికలను హేతుబద్దీకరించాల్సిన అవసరముందన్న జవదేకర్.. ఈ ఏడాది నుంచి పుస్తకాల భారం తగ్గించే పనిలో పడతామన్నారు.

కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా? కేటీఆర్ అభిమాన సంఘాలపై ఆయన గుస్సా.. అన్ని రద్దు...! ఎందుకలా?

NCERT ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొన్న జవదేకర్ విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రాలకు గ్రేడింగ్ ఇవ్వడం మూలాన లోటుపాట్లు బయటకు వస్తాయని.. అదే సమయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే వీలుంటుందని వెల్లడించారు. పాఠ్యాంశాలను హేతుబద్దీకరించడం ద్వారా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గనుందని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఈ ఏడాది నుంచి పని మొదలుపెట్టి 2021 సంవత్సరం నాటికి 50 శాతం వరకు స్కూల్ బ్యాగుల బరువు తగ్గిస్తామని తెలిపారు.

gradings will be given to states in edcuation system

క్రియేటివిటీ ఎడ్యుకేషన్.. విద్యారంగాన్ని సమూలంగా మార్చగలదనే అభిప్రాయం వ్యక్తం చేశారు జవదేకర్. NCERT పుస్తకాలను 2 సంవత్సరాల కిందట 2 కోట్ల వరకు పంపిణీ చేయగా.. పోయినేడాది 6 కోట్ల పుస్తకాలు సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ సంవత్సరానికి 8 కోట్ల పుస్తకాలు ముద్రించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

English summary
It seems that the central government has been emphasizing the changes in the education sector. The comments made by Central Human Resources and Development Minister Javadekar have been strengthened by the Grading of the respective states based on their talent. The rationalization of the curriculum suggests that students can lose weight of books. By 2021, 50 percent of school bags would be reduced by weight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X