వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌లో రెచ్చిపోయిన ముష్కరులు.. బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్‌తో దాడి, ఐదుగురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

జమ్ముకశ్మీర్‌లో ఆగంతకులు మళ్లీ రెచ్చిపోయారు. రాజౌరి జిల్లాలో బీజేపీ నేత జస్బీర్ సింగ్ ఇంటిపై గ్రనేడ్ దాడి చేశారు. దాడిని జమ్ము ఏడీజీపీ ధృవీకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఖండ్లీ ఏరియాలో గల సింగ్ ఇంటిపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడిలో ఐదుగురు గాయపడ్డారని తెలిపారు. వెంటనే వారిని సమీపంలో గల ఆస్పత్రికి తరలించారు.

మరోవైపు కశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిాయి. ఇద్దరు భద్రతా సిబ్బంది సహా నలుగురు గాయపడ్డారు. బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ముష్కరులు దాడి చేయడంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. కాన్వాయ్ జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్తుండగా.. మల్ పోర వద్ద గల జాతీయ రహదారిపై కాల్పులు జరిగాయి.

 Grenade attack on BJP leader Jasbir Singhs house in J&Ks Rajouri

Recommended Video

Spl report on Public at Indravalli public meeting

ఇటు బీజేపీ నేత ఇంటిపై గ్రనేడ్ దాడి అంశం కూడా కలకలం రేపింది. దాడితో రాజౌరి సెక్టార్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొంతకాలంగా కశ్మీర్ స్తబ్దుగా ఉంది. కానీ ఇటీవల వరసగా.. దాడులు జరుగుతుూనే ఉన్నాయి. ముష్కరులకు భద్రతాదళాలు ధీటుగా బదులు ఇస్తున్నారు.

English summary
five people were injured in a grenade attack on Bharatiya Janata Party leader Jasbir Singh's house in Khandli area of Jammu and Kashmir's Rajouri district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X