• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వేళ ఘనంగా పెళ్లి: రెండ్రోజులకే వరుడు మృతి, 95 మంది అతిథులకు పాజిటివ్

|

పాట్నా: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు, అధికారులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు సూచిస్తూనే ఉన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను కూడా అమలు చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరు ప్రజలు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పెరిగిపోతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది.

కరోనావైరస్ ల్యాబ్ సృష్టేనా?: తొలిసారి స్పందించిన వుహాన్ ల్యాబ్, శాస్త్రవేత్తల మాటేమిటంటే?

కరోనా వేళ ఘనంగా పెళ్లి..

కరోనా వేళ ఘనంగా పెళ్లి..

తాజాగా బీహార్ రాష్ట్రంలోనూ ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనే ఒకరి ప్రాణం తీసింది. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఓ జంట ఘనంగా వివాహం చేసుకుంది. భారీ సంఖ్యలో బంధువులు, అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అంతా బాగానే ఉన్నా.. పెళ్లైన రెండు రోజులకే నవ వరుడు మరణించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పెళ్లైన రెండ్రోజులకే వరుడు మృతి..

పెళ్లైన రెండ్రోజులకే వరుడు మృతి..

ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాలిగంజ్ గ్రామానికి చెందిన ఓ యువకుడు గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేసుకోలేదు. అంతేగాక, సొంత రాష్ట్రానికి వచ్చి జూన్ 15న వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రెండు రోజులకే వరుడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పాట్నాలోని ఎయిమ్స్ కు తరలిస్తుండగా అతడు ప్రాణాలు వదిలాడు.

అధికారులకు తెలియకుండా అంత్యక్రియలు

అధికారులకు తెలియకుండా అంత్యక్రియలు

అయితే, వరుడు చనిపోయినా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు అతడి దహణ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ప్రభుత్వ అధికారులు వివాహానికి హాజరైన దగ్గరి బంధువులకు కరోనా పరీక్షలు నిర్వహించడం ప్రారంభించారు. వీరిలో 15 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అతిథులందరికీ పరీక్షలు చేశారు.

పెళ్లికి హాజరైన 95 మందికీ కరోనా పాజిటివ్.. నవవధువు నెగిటివ్

పెళ్లికి హాజరైన 95 మందికీ కరోనా పాజిటివ్.. నవవధువు నెగిటివ్

సోమవారం పెళ్లికి హాజరైన మరో 80 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో పెళ్లికి హాజరైన వారిలో మొత్తం 95 మంది కరోనా బారినపడిట్లు తేలగా.. పెళ్లి కూతురు మాత్రం నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వివాహాది కార్యక్రమాలకు 50 మందికి మించి అతిథులు హాజరుకాకూడదని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉన్నప్పటికీ వీరు పాటించకుండా అధిక సంఖ్యలో అతిథులతో కార్యక్రమాన్ని నిర్వహించారని అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్లే ఇన్ని కేసులు వెలుగుచూశాయని చెప్పారు.

English summary
Over 90 people who were part of a wedding at a Patna village have tested positive for the novel coronavirus. The 30-year-old groom, a software engineer in Gurugram, had died two days after tying the knot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more